నాన్నకు ప్రేమతో మంచు

తండ్రి మోహన్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు మంచు మనోజ్. ఇందులో వింత ఏముంది

తండ్రి మోహన్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు మంచు మనోజ్. ఇందులో వింత ఏముంది.. ప్రతి ఏడాది చెబుతాడు కదా అనుకోవద్దు. ఈ ఏడాది కచ్చితంగా ఇది వింతే.

ప్రస్తుతం ఈ తండ్రికొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది వ్యవహారం. అలా గొడవలు మొదలైన తర్వాత మోహన్ బాబు పుట్టినరోజు జరుపుకోవడం ఇదే తొలిసారి.

అందుకే కాస్త ఎమోషనల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు మనోజ్. “ఈ బర్త్ డేకు నీ పక్కనే ఉండి సెలబ్రేట్ చేసుకునే అవకాశం మిస్సయ్యాను, నీ దగ్గరకు రావడానికి తహతహలాడుతున్నాను నాన్నా..” అంటూ పోస్టు పెట్టాడు.

జల్ పల్లిలోని తన నివాసం నుంచి పోలీసుల సహకారంతో మంచు మనోజ్ కుటుంబాన్ని వెల్లగొట్టారు మోహన్ బాబు. అంతకంటే ముందు తండ్రికొడుకుల మధ్య చాలా గొడవలు జరిగాయి. ఇద్దరూ పరస్పరం ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టుకున్నారు.

ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు ఏకంగా దాడి చేసే పరిస్థితి వచ్చింది. అది కాస్తా పెద్ద కేసు అయింది. ఇంత జరిగిన తర్వాత మనోజ్ పెట్టిన పోస్ట్ కి మోహన్ బాబు కరుగుతారా అనేది చూడాలి.

6 Replies to “నాన్నకు ప్రేమతో మంచు”

  1. If this Kannappa movie is any kind of remake of Bhakta Kannappa then what r they thinking about themselves? This Kannappa looks like a movie of Scotland wars with those backgrounds and costumes. Why to make such ??

Comments are closed.