రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ నుంచి మల్లూవుడ్ వరకు చాలామంది ఆర్టిస్టుల్ని సంప్రదించినట్టు గతంలో కథనాలు వచ్చాయి.
మరీ ముఖ్యంగా జాన్ అబ్రహాం పేరు దాదాపు లాక్ అయినట్టు గాసిప్స్ వచ్చాయి. అంతలోనే పృధ్వీరాజ్ సుకుమారన్ పేరును ఫైనలైజ్ చేయడం, ఆయన సెట్స్ లో ప్రత్యక్షమవ్వడం జరిగిపోయాయి.
అయితే ఈ ఊహాగానాల్ని, కథనాల్ని పరోక్షంగా తిప్పికొట్టాడు పృధ్వీరాజ్. మహేష్-రాజమౌళి సినిమాలో తను ఏడాదిగా కొనసాగుతున్నట్టు ప్రకటించాడు. ఇంకా చెప్పాలంటే ఏడాది కంటే కాస్త ఎక్కువ సమయాన్నే మహేష్-రాజమౌళిలో గడిపానని అంటున్నాడు.
ప్రీ ప్రొడక్షన్ వర్క్ నుంచి తను ఈ ప్రాజెక్టులో భాగమయ్యాడట. కాకపోతే కొన్ని నిబంధనల వల్ల ఆ విషయాన్ని తను బయటకు చెప్పలేదని తెలిపాడు. ఎప్పుడైతే ఒరిస్సాలోని కోరాపుట్ షెడ్యూల్ లో మహేష్ తో కలిసి తను ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకొచ్చాయో.. ఇక దాచిపెట్టడానికేం లేదని అంటున్నాడు పృధ్వీరాజ్.
త్వరలోనే రాజమౌళి, మహేష్ తో కలిసి తను కూడా మీడియా ముందుకురాబోతున్నట్టు ప్రకటించాడు పృధ్వీరాజ్. ప్రస్తుతానికైతే షూటింగ్ శరవేగంగా జరుగుతోందన్నాడు. ప్రియాంక చోప్రా ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా నటిస్తోంది.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,