పుష్ప-2.. ఇప్పట్లో ఓటీటీలోకి రాదా?

పుష్ప-2 విషయంలో ఇప్పటివరకు నెట్ ఫ్లిక్స్ నుంచి ఎలాంటి సౌండ్ లేదు. దీంతో ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

“రిలీజ్ డేట్ నుంచి 56 రోజుల్లోపు ఈ సినిమా ఎట్టిపరిస్థితుల్లో ఓటీటీలోకి రాదు.” కొన్ని రోజుల కిందట మైత్రీ మూవీ మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ఇది. సంక్రాంతికి ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందనే పుకార్లను ఖండిస్తూ, ఈ ప్రకటన ఇచ్చింది.

ఈ స్టేట్ మెంట్ తో పరోక్షంగా స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ వెల్లడించినట్టయింది. రిలీజ్ డేట్ నుంచి 56 రోజులంటే, జనవరి 29 అవుతుంది. సో.. జనవరి 29 రాత్రికే ఈ సినిమా స్ట్రీమింగ్ కు వస్తుందని అంతా ఫిక్స్ అయిపోయారు.

కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఈ సినిమా నెలాఖరుకు వచ్చేలా కనిపించడం లేదు. దీనికి కారణం నెట్ ఫ్లిక్స్ ఇంకా స్పందించకపోవడమే. హిట్టయిన పెద్ద సినిమాల విషయంలో నెట్ ఫ్లిక్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. దాదాపు 10 రోజుల ముందు నుంచే అది చేసే ప్రచారం ఓ రేంజ్ లో ఉంటుంది.

కానీ పుష్ప-2 విషయంలో ఇప్పటివరకు నెట్ ఫ్లిక్స్ నుంచి ఎలాంటి సౌండ్ లేదు. దీంతో ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ కు వస్తుందనేది ఓ డౌట్ అయితే, రీ-లోడెడ్ వెర్షన్ వస్తుందా రాదా అనేది మరో సందేహం. రీసెంట్ గా పుష్ప-2 సినిమాకు దాదాపు 20 నిమిషాల సన్నివేశాల్ని అదనంగా యాడ్ చేసిన సంగతి తెలిసిందే. అలా అదనంగా జోడించిన సీన్స్ తో కలిపి స్ట్రీమింగ్ చేయాలని అల్లు అర్జున్ ఆర్మీ కోరుతోంది. ప్రస్తుతానికైతే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఎలాంటి స్పష్టత లేదు.

8 Replies to “పుష్ప-2.. ఇప్పట్లో ఓటీటీలోకి రాదా?”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.