హీరోలు తమ రెమ్యూనరేషన్‌లో సగం బ్లాక్ పద్ధతిన తీసుకోవడం వల్ల తాము అకౌంట్ల విషయంలో కిందా మీదా కావాల్సి వస్తోందని, లేదంటే అసలు ఐటీ వాళ్లతో ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదని టాలీవుడ్‌లోని పలువురు నిర్మాతల మాట. పది కోట్లు ఆ పైకి తీసుకునే డైరెక్టర్లు, పది కోట్లు ఆ పైన తీసుకునే హీరోలు కచ్చితంగా బ్లాక్ తీసుకుంటారన్నది ఇండస్ట్రీ ఇన్‌సైడ్ వర్గాల మాట.
ఈ పాయింట్‌ను సీనియర్ హీరో వెంకటేష్ దగ్గర ప్రస్తావిస్తే, తాను తీసుకునేదే కొంచెం అని, అది పూర్తిగా వైట్‌లోనే తీసుకుంటానని చెప్పేశారు. మిగిలిన వారి సంగతి తనకు తెలియదన్నారు. నిజమే, ఆయనకు తెలియకపోవచ్చు. కానీ టాలీవుడ్‌లో వినిపించే నంబర్లు వింటుంటే కాస్త అనుమానపడాల్సిందే. రాజకీయ నాయకుల ఆస్తి పాస్తుల వివరాలు ఏటేటా ఓపెన్‌గా తెలుస్తుంటాయి. కానీ సినిమా హీరోలవి అలా తెలియవు.
ఒక సీనియర్ హీరో రెమ్యూనరేషన్ 70 కోట్లు. అంత మొత్తం వైట్‌లో తీసుకుంటున్నారో లేదో తెలియాలంటే అది ఆదాయపన్ను శాఖకు మాత్రమే తెలుస్తుంది. మరో సీనియర్ హీరో 25 కోట్ల వరకు తీసుకుంటున్నారు. ఈయన సగానికి సగం బ్లాక్ తీసుకుంటారని టాక్ ఉంది. ఇంకో సీనియర్ హీరో ఎక్కువ వైట్‌నే తీసుకుంటారు. కానీ పొలిటికల్ పనులు, ఇతరత్రా వ్యవహారాలు ఉంటే మాత్రం బ్లాక్ తీసుకుంటారని టాక్ ఉంది.
ఇక వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల పైకి తీసుకునే యంగ్ టాప్ హీరోలు మొత్తం వైట్ చూపిస్తారని అనుకోవడం కాస్త అనుమానమే. కానీ ఎవరికీ తెలుసు. ఆదాయపన్ను శాఖ అధికారులు హీరోల ఇళ్ల మీదకు వచ్చి చాలా అంటే చాలా కాలం అయింది. ఒకప్పుడు హీరోల ఇళ్లలోనే సోదాలు జరిగేవి. అది జమానా నాటి కాలం. ఇప్పుడు అస్సలు హీరోలను టచ్ చేయడం లేదు.
ఇండస్ట్రీలో బ్లాక్ మనీకి మూలం అక్కడే ఉందన్న విషయం ఐటీ అధికారులు గుర్తించి, ఆ దిశగా కదిలితే, నిర్మాతలు హ్యాపీ అవుతారు.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు ఐదు
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
ఒక్కసారి ప్యాలస్ ను కూడా చెక్ చేస్తే సరి
YOU ARE DOUBTING THEM? మన హీరోలు దేవుళ్ళు. వాళ్ళని తప్పు పడితే దేవుళ్ళు క్షమించిన కాని పి??చ్చి ఫాన్స్ క్షమించరు.
ARE YOU DOUBTING THEM? వాళ్ళు దేవుళ్ళు. వాళ్ళని త?? ప్పు పడి??తే దేవుళ్ళు క్షమిం??చిన కాని ??పి??చ్చి ఫా??న్స్ క్షమిం??చరు.
Nuvvu teesukuntunnavu kada producers daggara black lo reviews