నా డబ్బు మొత్తం వైట్ – వెంకటేశ్

మిగతా హీరోల సంగతి నాకు తెలియదు. నేను మాత్రం ఫుల్ వైట్. నేను తీసుకునేది (పారితోషికం) చాలా తక్కువ.

ఇండస్ట్రీలో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్న నేపథ్యంలో, తన ఆదాయంపై స్పందించారు సీనియర్ హీరో వెంకటేశ్. తను తీసుకునేది చాలా తక్కువని, అది కూడా పూర్తిగా వైట్ మనీ అని ఆయన స్పష్టం చేశారు.

“మిగతా హీరోల సంగతి నాకు తెలియదు. నేను మాత్రం ఫుల్ వైట్. నేను తీసుకునేది (పారితోషికం) చాలా తక్కువ. నేను ఎక్కువ తీసుకోను. ఆ తీసుకునేది కూడా వైట్ రూపంలోనే తీసుకుంటాను. ఖర్చుల కోసం రోజూ నామినల్ గా కొంత మొత్తం తీసుకుంటాను. మిగతాదంతా ఫుల్ వైట్.”

ఐటీ దాడుల నేపథ్యంలో.. హీరోలు తమ పారితోషికాన్ని పూర్తిగా వైట్ రూపంలో తీసుకుంటే, ఏ నిర్మాత బ్లాక్ మనీ వెంట పడాల్సిన అవసరం లేదనే స్టేట్ మెంట్ కొంతమంది నిర్మాతల నుంచి వచ్చింది. తన వరకు ఈ వాదనను ఖండిస్తూ, పై విధంగా స్పందించారు వెంకటేశ్.

ఇండస్ట్రీలో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయమే విషయంపై ‘అవునా..’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నటించిన వెంకటేశ్.. తను దేవుడ్ని ఏదీ అడగనని, వచ్చింది హ్యాపీగా తీసుకుంటానని అన్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు వస్తున్న భారీ వసూళ్లు, తన కెరీర్ కు పెద్ద బోనస్ అని అన్నారాయన.

4 Replies to “నా డబ్బు మొత్తం వైట్ – వెంకటేశ్”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. ఎవరికి వారు తాము పునీతులని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసుకొంటే సరి! ఐటీ శాఖ వారు వీరి వైపు కన్నెత్తి చూడరు.

  3. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.