మొన్నటివరకు ట్విట్టర్ కే పరిమితమైన పూనమ్ కౌర్ వివాదం మెల్లమెల్లగా ఓ షేప్ తీసుకుంటోంది. త్వరలోనే ఇది టాలీవుడ్ లో పెద్ద దుమారం రేపే అవకాశం ఉంది. ఎప్పుడైతే పూనమ్ కౌర్ నేరుగా త్రివిక్రమ్ పేరును ప్రస్తావించారో, అప్పుడే ఈ ఇష్యూ పెద్దదైంది. ఇప్పుడు మరింత పెద్దది కానుంది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందుకొచ్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పూనమ్ కౌర్ ప్రకటించింది. అయితే అలా వచ్చేందుకు ఆమె ఓ షరతు పెట్టింది. ఓ మహిళకు సంబంధించిన సమస్యను మరో మహిళ వింటేనే సరిగ్గా అర్థం చేసుకుంటారని, తన సమస్యను విన్నవించుకునేందుకు తనకు అసోసియేషన్ నుంచి ఓ మహిళా ప్రతినిధి కావాలని ఆమె డిమాండ్ చేశారు.
పూనమ్ కౌర్ ఇష్యూపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున శివబాలాజీ తాజాగా స్పందించాడు. పూనమ్-త్రివిక్రమ్ వివాదానికి సంబంధించి అసలు ఫిర్యాదు అందలేదని.. లేని ఫిర్యాదు గురించి తామే వెదుక్కొని తామే పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం లేదని ప్రకటించాడు.
నిజంగా పూనమ్ కౌర్ కు ఏదైనా ఇష్యూ ఉంటే అసోసియేషన్ ఆఫీస్ కు రావాలని, తను చెప్పదలుచుకున్నది చెప్పాలని అన్నాడు. ఇప్పుడు పూనమ్ కౌర్ కూడా ఇదే పాయింట్ కు వచ్చింది. తనకు అసోసియేషన్ కు రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, కాకపోతే తన గోడు చెప్పుకునేందుకు ఓ మహిళా ప్యానెల్ కావాలని ఆమె కోరుతున్నారు.
ఈ సందర్భంగా గతంలో తను ఇచ్చిన ఫిర్యాదుపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. తను లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశానని, అప్పట్లో ఝాన్సీతో ఈ విషయంపై మాట్లాడానని అంటోంది పూనమ్. జానీ మాస్టర్ ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడు, ఎలాగైతే ఓ మహిళా ప్యానెల్ రంగంలోకి దిగిందో, అలా తనకు కూడా అసోసియేషన్ తరఫు నుంచి ఓ మహిళా బృందం కావాలంటోంది.
తనపై ఎన్నో విమర్శలొచ్చాయని, ఎంతో ట్రోలింగ్ జరిగిందని, కానీ ఇన్నేళ్లుగా తను మౌనంగానే ఉన్నానని అంటోంది. తను మాట్లాడితే అది తప్పు అవ్వొచ్చు లేదా రైట్ అవ్వొచ్చని.. కానీ తన సమస్య విన్న తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఓ స్టేట్ మెంట్ వస్తే కరెక్ట్ గా ఉంటుందని తను భావించానని తెలిపింది. అసోసియేషన్ పై తనకు పూర్తి నమ్మకం ఉందంటోంది. చూస్తుంటే, ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
ఎలాంటి ఆధారాలు లేవు. ఉండవు అలాగే కుష్బూ లాంటి వాళ్ళు మొన్న ఎవరో j c మీద కాంప్లైయిం చేసినామె ఇల్ల బోలెడు స్క్రాప్
katha, screen play, direction by chakram baba
Ayanevaru? Prabhas na?
centre lo chakram tippina …
అలియాస్ బొల్లి బాబు!
Nee name chustene telustundi evadiki puttavo…vedava laaga okari gurinchi bolli ani comment pettinappude nuvvu oka vedava ani telustundi
Emeku movie avakasalu enduku ravadam ledu. Kaneesam acting fitness ki try chesi, andubatulo vunna ani photshoots avi cheyyochu kada?
evo appudappu web page space utilization kosam ilanti news vestaru
Trivikram srinivas can be trapoed in this case n he won’t come back without jail like Johny master.
3vikram is a good man. please don’t trouble him