లోకేశ్ వార‌స‌త్వంపై.. బాబూ ఏం సెప్తిరి ఏం సెప్తిరి!

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడికి వ‌య‌సు పైబ‌డుతున్న నేప‌థ్యంలో ఆయ‌న వార‌సుడైన లోకేశ్‌ను రాజ‌కీయ వార‌సుడిగా ప్ర‌క‌టించాల‌నే డిమాండ్లు ఇటీవ‌ల కాలంలో వెల్లువెత్తుతున్నాయి. లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చేయాల‌నే డిమాండ్లు రావ‌డం అందులో భాగంగానే చూడాలి.…

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడికి వ‌య‌సు పైబ‌డుతున్న నేప‌థ్యంలో ఆయ‌న వార‌సుడైన లోకేశ్‌ను రాజ‌కీయ వార‌సుడిగా ప్ర‌క‌టించాల‌నే డిమాండ్లు ఇటీవ‌ల కాలంలో వెల్లువెత్తుతున్నాయి. లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చేయాల‌నే డిమాండ్లు రావ‌డం అందులో భాగంగానే చూడాలి. ప్ర‌స్తుతం అన‌ధికారికంగా టీడీపీలోనూ, కూట‌మి ప్ర‌భుత్వంలోనూ లోకేశ్ మాటే చెల్లుబాటు అవుతోంద‌న్న‌ది వాస్త‌వం.

చంద్ర‌బాబునాయుడు పేరుకే ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షుడ‌ని… పెత్త‌నం అంతా లోకేశ్‌దే అని లోకం కోడై కూస్తోంది. అయిన‌ప్ప‌టికీ దావోస్ వేదిక‌గా లోకేశ్ వార‌స‌త్వంపై చంద్ర‌బాబు కామెంట్స్ ఔరా ఎంత చ‌తుర‌తో క‌దా అనిపించేలా ఉన్నాయి. లోకేశ్ వార‌స‌త్వంపై బాబు అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం.

“వ్యాపారం అయితే లోకేశ్‌కు చాలా తేలికైన ప‌ని. కానీ ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే ఆలోచ‌న‌తో లోకేశ్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. అందులో సంతృప్తి పొందుతున్నారు. ఇందులో వార‌స‌త్వం అంటూ ఏమీ లేదు. వ్యాపారం, సినిమా, రాజ‌కీయం, కుటుంబం…ఏ రంగ‌మైనా వార‌స‌త్వం అనేది మిథ్య” అన్నారు చంద్ర‌బాబు.

త‌న‌కు వార‌సుడు కాకుండానే, పార్టీలోనూ, ప్ర‌భుత్వంలోనూ లోకేశ్ పెత్త‌నం చెలాయిస్తారా? అయినా రాజ‌కీయానికి మించిన వ్యాపారం ఏమైనా వుంటుందా? అందుకే లోకేశ్ రాజ‌కీయ రంగాన్ని ఎంచుకున్నార‌నే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.

చంద్ర‌బాబు కుమారుడు కావ‌డం వ‌ల్లే క‌దా ఆయ‌న్ను డిప్యూటీ సీఎంగా చేయాల‌ని సీనియ‌ర్ నేత‌లు సైతం పోటీలు ప‌డుతూ మ‌రీ డిమాండ్లు చేస్తున్నారు. లోకేశ్ కంటే తెలివైన‌, అనుభ‌వ‌జ్ఞులైన నాయ‌కులున్నారు క‌దా? మ‌రి వాళ్ల పేర్ల‌ను వార‌సులుగా ఎందుకు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి.

ఉదాహ‌ర‌ణ‌కు కేంద్ర మంత్రి రామ్మోహ‌న్‌నాయుడికి చంద్ర‌బాబు బాధ్య‌త‌లు అప్ప‌గించే మ‌న‌సు వుందా? అని జ‌నాలు ప్ర‌శ్నిస్తున్నారు. బాబు కుమారుడు కావ‌డం వ‌ల్లే లోకేశ్‌ను వార‌సుడిగా అంద‌రూ భావిస్తున్నార‌నేది నిజం. లోకేశ్‌కు ప‌ట్టాభిషేకం ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు. అందుకు భిన్నంగా దావోస్ వేదిక‌గా చెప్పినంత మాత్రాన‌, జ‌నం న‌మ్ముతార‌ని అనుకుంటే ఎలా? అనే నిల‌దీత ఎదుర‌వుతోంది.

44 Replies to “లోకేశ్ వార‌స‌త్వంపై.. బాబూ ఏం సెప్తిరి ఏం సెప్తిరి!”

  1. కాదు కాదు.. మన పార్టీ లో అయితే.. సంతకాలు సేకరిస్తే గొప్ప లీడర్ అంటారు..

    వారసుడు కాబట్టి.. సంతకాలు పెట్టారు.. లేకపోతే కింద బొచ్చు ముక్క తీసి చేతిలో పెట్టేవాళ్ళు..

  2. మరి అన్నని అడగపోయావా..సీఎం సీట్ నీకు ఎందుకు సీనియర్లు పెద్దిరెడ్డి, బొత్స, ధర్మాన, తమ్మినేని, ఉమ్మారెడ్డి ఉండగా అని?వైస్సార్ కొడుకు కాకపోతే ఆయనకీ ఉన్న అరహతా ఏమిటి?

  3. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  4. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  5. ది వరల్డ్ మోస్ట్ హానెస్ట్ పొలిటిషన్ చంద్రబాబు

    ది వరల్డ్ మోస్ట్ ఇంటెలిజెంట్ పొలిటిషన్ లోకేష్

    ఆంధ్ర ప్రదేశ్ ని పాలించడం ప్రజలు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం.

    1. ఆర్జీవీ కి జ్ఞానోదయం అయిందని అందరూ అంటుంటే .. అబద్ధమేమో అనుకొన్నా..

      అయితే నిజమేనన్నమాట..

  6. అరే హౌలె గా .వైఎస్. రాజశేఖర్ రెడ్డి గారు లేకుంటే జగన్ గాడు ఎవడురా

  7. వారసత్వం తో పని లేకుండా సీఎం ,డీసీఎం చేయగల సత్తా ఉందని ప్రజలు నమ్మితే ఎవరైనా సీఎం అవ్వచ్చు పదవులు సాధించవచ్చు..

    అదే బాబు గారు చెప్పారు …వారసత్వం అనేది ఒక rift మాత్రమే ట్రావెల్ ఎలా చేస్తున్నాం అనేదేమన మీద ఆధారపడి ఉంటుంది.

  8. మా నాయన తరువాత నన్ను ఏకంగా సీఎం చేయమని ఒక పెద్ద మనిషి అడిగారు అప్పట్లో .. తమరు అప్పుడు ఇలా రాయలేదు .. ఎందుకు అంటే న్యూట్రల్ జర్నలిజం ..

  9. నిజమె! అందరూ ఉన్న కంగ్రెస్స్ లొ, Y.-.S.-.R చనిపొగానె, మొదటి సారి రాజకీయలలొకి వచ్చి MP గా గెలిచిన jagan ని మాత్రం అమాంతం CM ని చెయలి అని అప్పట్లొ ఊగిపొయావ్!

    మరి అదెమిటిరా గురువిందా???

  10. ఏదైనా నాచురల్ గా జరిగిపోవాలి. జనాలు యాక్సెప్ట్ చేయాలి. తెలంగాణలో brs పవర్ లో ఉన్నపుడు ఇలానే హడావిడి చేశారు కేటీఆర్ సీఎం అవ్వాలి అని పార్టీ వాళ్ళు, కానీ జనాలు తిప్పి కొట్టారు.

  11. లోకేష్, తరువాత లోకేష్ కొడుకు cm అవుతారు, ఇది పక్కా. చంద్రన్న వరసత్వమా మజాకానా.

  12. ప్యాలస్ ఇద్దరు అల్లుడు ఎవరో లీక్ అయ్యింది.

    1. కాపు వర్గం అబ్బాయి. విదేశాల్లో వందల కోట్లు ఆస్తులు వున్నాయి.

    2. దళిత ఐఏఎస్. కన్వర్టెడ్ క్రిస్టియన్. దక్షిణ భారత దేశం నీ యేసు దేశం గా మార్చే లాజరాజ్ ప్రజెక్టు లో ముఖ్య సభ్యుడు.

    పాపం రెడ్డి కులం అబ్బాయిలకి అవకాశం లేదు ఈ సరికి.

  13. జనాలకి కుల పిచ్చి పార్టీల పిచ్చి అభిమాన హీరోల పిచ్చి ఇవన్ని తలకెక్కి కొట్టుకొని చస్తున్నారు కానీ ఎవడైనా ఒకటే అందరూ వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకునే దానికోసం జనాలని వాడుకుంటారు అంతే ఎవరి పని వాళ్లు ఎవరి కష్టం వాళ్ళు నమ్ముకుంటే మేలు జరుగుతుంది

Comments are closed.