సినిమా సంస్థల మీద, నిర్మాతల ఇళ్ల మీద ఆదాయపన్ను దాడులు ప్రారంభమై మూడు రోజులు గడిచాయి. ఈ రోజు విజయవంతమైన నాలుగో రోజు. నిర్మాత దిల్ రాజు ను ఇంటి నుంచి ఆఫీసుకు తీసుకువచ్చారు అంటే, దాదాపు ముగిసినట్లే. ఆఫీసుకు తీసుకువచ్చి, ఏం డాక్యుమెంట్లు దొరికాయి.. ఏం దొరికాయి అన్నది స్టేట్ మెంట్ తయారు చేసి, సంతకాలు తీసుకుని, దాడులు ముగిస్తారు. అది ఎప్పుడూ జరిగే పద్దతి. అందువల్ల ఈ రోజుతో దాడులు ముగిస్తాయి అని అనుకోవచ్చు.
ఈ లోగా రకరకాల గ్యాసిప్ లు. ఆ కాగితాలు దొరికాయి.. ఈ నగదు దొరికింది…అలా.. ఇలా అంటూ. నిజానికి ఈ రోజున పెద్ద పెద్ద సంస్థలు అన్నీ అక్కౌంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వుంటున్నాయి. ఎక్కడా లోటు లేకుండా మెయింటెయిన్ చేస్తున్నారు. ముఖ్యంగా జిఎస్టీ, టీడీఎస్ అన్నవి కీలకంగా మారిపోయిన తరువాత అస్సలు నిర్లక్ష్యం చేయడం లేదు. అందువల్ల పెద్దగా సమస్య వుంటుంది అని అనుకోవడానికి లేదు.
పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్ వంటి సినిమాల విడుదలకు ముందు, వెనుక వార్తల్లోకి వచ్చి పెద్ద పెద్ద అంకెలు కాస్త సమస్య కావచ్చు. స్టేజ్ ల మీద చెప్పిన పెద్ద పెద్ద కబుర్లు కావచ్చు. పాటలకు ఇంత ఖర్చు చేసాం..అంత ఖర్చు చేసాం. ఇన్ని కోట్లతో సెట్ వేసాం అన్నది కూడా ప్రభావం చూపించింది. అందుకే ఆర్ట్ డైరక్టర్ ను కూడా రప్పించి ప్రశ్నించారని టాక్ వచ్చింది.
పుష్ప 2 ఫంక్షన్ లో యాంకర్ సుమ చేత పదే పదే 1000 కోట్ల మార్కెట్ అని చెప్పించింది బన్నీ టీమ్. అది నిర్మాతలకు ఇష్టం లేదు. అయినా పదే పదే చెప్పించారు. అది కూడా ఇప్పుడు పీకల మీదకు తెచ్చింది.
ఇదిలా వుంటే ఓ గ్యాసిప్ చక్కర్లు కొడుతూంది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఐటి అధికారులకు గట్టిగా దొరికారని, 90 కోట్ల మేరకు ట్రాన్సాక్షన్లకు సమాధానం చెప్పాల్సి వుందని టాక్ వినిపిస్తోంది. వైట్ ను బ్లాక్, బ్లాక్ ను వైట్ చేసే వ్యవహారం జరిగిందని అందుకే ఇప్పుడు ఇబ్బందులు వచ్చాయని తెలుస్తోంది.
ఫారిన్ నుంచి వచ్చిన ఫండ్స్ మీద ఎక్కువగా దృష్టి సారించారు.
అలాగే ఐటి అధికారులు వివిధ నిర్మాణ సంస్థల్లోని అక్కౌంట్స్ సిబ్బందిని చాలా కఠినంగా ప్రశ్నించారని, గట్టిగా గద్దించి నిజాలు రాబట్టారని తెలుస్తోంది.
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
enti idi number haa
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
Pushap collections 731 crores ani chepparanta kada?