వీరేంద్ర సెహ్వాగ్ కు కూడా అది త‌ప్ప‌లేదా!

సానియా మీర్జా, ఏఆర్ రెహ‌మాన్ .. ఈ వ‌ర‌స‌లో ఇప్పుడు సెహ్వాగ్ చేరితే, సుదీర్ఘ కాలం కాపురాలు చేసి విడాకుల తీసుకున్న దంప‌తుల జాబితాలో చేరిన‌ట్టుగా అవుతుంది.

ఇప్పుడు కాదు.. ఎప్పుడో రెండు ద‌శాబ్దాల కింద‌ట పెళ్లి చేసుకున్నాడు వీరేంద్ర సెహ్వాగ్. అది కూడా అత‌డికి కాస్త చిన్న వ‌య‌సు ఉన్న‌ప్పుడే వివాహం చేసుకున్నాడు, పాతికేళ్ల లోపు వ‌యసులోనే పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పుడు సెహ్వాగ్ దంప‌తులు కూడా విడాకుల బాట ప‌డుతున్నార‌నే వార్త‌లు వ‌స్తూ ఉన్నాయి.

అప్ప‌ట్లోనే సెహ్వాగ్ పెళ్లి ముచ్చ‌ట్లు మీడియాలో అచ్చ‌య్యాయి, సెహ్వాగ్ త‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచి తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడంటూ పెళ్లికి ముందే మీడియా క‌థ‌నాల‌ను ఇచ్చింది. ఎంత ఎదిగిని వీరేంద్రుడు తమ కుటుంబానికి తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్న గుడ్ బాయ్ అన్న‌ట్టుగా క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇప్ప‌టిలా క్రికెట‌ర్ల భార్య‌లు వీవీఐపీ గ్యాల‌రీల్లో నిత్యం క‌నిపించే రోజులు కావ‌వి.

స‌చిన్, ద్రావిడ్, ల‌క్ష్మ‌ణ్, గంగూలీ వంటి స్టార్ ప్లేయ‌ర్ల భార్య‌లు కూడా అరుదుగా క‌నిపించే వారు మ్యాచ్ ల స‌మ‌యాల్లో. అలాగే సెహ్వాగ్ దాంప‌త్యం కూడా సాగిన‌ట్టుగా ఉంది చాలా కాలం పాటు. అయితే ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నార‌నే వార్త‌లు వ‌స్తూ ఉన్నాయి. సోష‌ల్ మీడియాలో కూడా వీరు అన్ ఫాలో చేసేసుకున్నార‌ట‌. చాలా కాలంగా వీరు వేర్వేరుగా జీవిస్తున్న‌ట్టుగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

మ‌రి ఇర‌వై సంవ‌త్స‌రాల దాంప‌త్యం త‌ర్వాత సెహ్వాగ్ దంప‌తులు విడాకులు తీసుకోనున్నార‌నే వార్త‌ల‌పై వారే స్పందించాల్సి ఉంది. అయితే సెల‌బ్రిటీలు, ఆర్థిక స్వ‌తంత్రం ఉన్న వారు ఎన్ని సంవ‌త్స‌రాలు క‌లిసి ఉన్నా.. విడిపోయే మార్గాలు అలా తెరుచుకునే ఉంటాయేమో అనే ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి కొన్ని విడాకుల వ్య‌వ‌హారాలు. సానియా మీర్జా, ఏఆర్ రెహ‌మాన్ .. ఈ వ‌ర‌స‌లో ఇప్పుడు సెహ్వాగ్ చేరితే, సుదీర్ఘ కాలం కాపురాలు చేసి విడాకుల తీసుకున్న దంప‌తుల జాబితాలో చేరిన‌ట్టుగా అవుతుంది. సెల‌బ్రిటీల కాపురాల‌కు కాపురం చేసిన కాలం కూడా గ్యారెంటీ ఇవ్వ‌లేక‌పోతున్న‌ట్టుగా ఉంది!

2 Replies to “వీరేంద్ర సెహ్వాగ్ కు కూడా అది త‌ప్ప‌లేదా!”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.