దిల్ రాజును అరెస్ట్ చేశారా?

ఈరోజు సాయంత్రానికి తమ స్టేట్ మెంట్ ను లీగలైజ్ చేసి, దిల్ రాజుతో సంతకాలు పెట్టించి పని పూర్తిచేస్తారు అధికారులు.

ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల నేపథ్యంలో నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజును అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ పుకార్లు వస్తున్నాయి. ఓవైపు దిల్ రాజు నివాసంలో సోదాలు ముగిసేలోపే, ఐటీ అధికారులు మరోసారి తెరపైకొచ్చారు.

దిల్ రాజును ఆయన నివాసం నుంచి, అతడి నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్ కు తీసుకెళ్లారు అధికారులు. స్వయంగా ఐటీ అధికారులు తమ కారులో దిల్ రాజును అతడి ఆఫీస్ కు తీసుకెళ్లారు.

2 రోజుల కిందట దిల్ రాజు భార్యను కూడా ఇలానే కారులో బ్యాంకుకు తీసుకెళ్లి, లాకర్లు ఓపెన్ చేయించిన సంగతి తెలిసిందే.

దిల్ రాజును తమ వాహనంలో అతడి ఆఫీస్ కు తీసుకెళ్లే ముందు, మరో కారులో 6 డబ్బాల్లో కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బాల నిండా ఉన్న ఆ డాక్యుమెంట్లను ఐటీ ఆఫీస్ కు తరలించారా లేక లెక్కలు సరిచూసేందుకు దిల్ రాజు ఆఫీస్ కు తీసుకెళ్లారా అనేది తెలియాల్సి ఉంది.

ఐటీ అధికారుల కారు ఎక్కిన వెంటనే దిల్ రాజును అరెస్ట్ చేసినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అతడ్ని అదుపులోకి తీసుకొని, నేరుగా ఐటీ కార్యాలయానికి తీసుకెళ్తున్నారంటూ కథనాలు వచ్చాయి. అయితే దిల్ రాజు ఆఫీస్ కే ఆతడ్ని తీసుకెళ్లారు. ఈరోజు సాయంత్రానికి తమ స్టేట్ మెంట్ ను లీగలైజ్ చేసి, దిల్ రాజుతో సంతకాలు పెట్టించి పని పూర్తిచేస్తారు అధికారులు.

మరోవైపు అభిషేక్ అగర్వాల్, సుకుమార్, మైత్రీ నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఐటీ రైడ్స్ పూర్తిచేశారు అధికారులు.

One Reply to “దిల్ రాజును అరెస్ట్ చేశారా?”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.