మీర్ పేట కిరాత‌కం.. ల‌భించ‌ని ఆమె ఆన‌వాలు!

ఇంత ప్లాన్డ్ గా చేసినా అత‌డిని ప‌ట్టించ‌డంలో సీసీ కెమెరాలు కీల‌క పాత్ర పోషించాయని పోలీసులు క‌థ‌నాన్ని బ‌ట్టి స్ప‌ష్టం అవుతోంది.

త‌న భార్య‌పై అనుమానంతోనో, లేక త‌న‌కే వివాహేత‌ర సంబంధం ఉండ‌టం వ‌ల్ల‌నో భార్య‌ను హ‌త్య చేశాడు ఒక మాజీ సైనికుడు! క్ష‌ణికావేశంతో ఇలాంటి చేసి వార్త‌ల్లో నిలిచే వారు నిత్యం ఉండ‌నే ఉంటారు స‌భ్య‌స‌మాజంలో! అయితే.. ఇత‌డు చేసింది క్ష‌ణికావేశంలో కాద‌ని, చాలా ప్రీ ప్లాన్డ్ గా త‌ను అస‌లు హ‌త్య చేసిన‌ట్టుగా సాక్ష్యాలు లేకుండా చెరిపేసేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేశాడ‌ని .. దాని కోసం చాలా కిరాత‌క ప్ర‌ణాళిక అమ‌లు చేశాడ‌ని పోలీసులు చెబుతున్నారు.

విన‌డానికే విస్మ‌యాన్ని క‌లిగించే ఈ ఘ‌ట‌న చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భార్య‌ను హ‌త్య చేయ‌డ‌మే గాక‌, ఆమె శ‌వాన్ని ముక్క‌లుగా కొట్టి, వాటిని ఉడికించి, పిండి చేసి, మురికి కాలువ‌ల్లోనూ, చెరువులోనూ చ‌ల్లి ఆమె ఉనికే లేకుండా చేయాల‌ని అత‌డు ప్ర‌య‌త్నించాడు. మీర్ పేట్ లో జ‌రిగిన ఈ కిరాత‌క ఘ‌ట‌న‌పై పోలీసులు విచార‌ణ కొన‌సాగుతూ ఉంది.

ఆమె శ‌వాన్ని ముక్కలుగా కొట్టి బ‌కెట్ లో వేసి వాట‌ర్ హీట‌ర్ వేసి ఉడికించాడ‌ట‌! వింటేనే క‌డుపుల్లో దేవేసేలా చేసేంత కిరాత‌కాన్ని అత‌డు ప్ర‌ద‌ర్శించాడు. ముందుగా త‌న భార్య వేరే వాళ్ల‌తో వెళ్లిపోయిన‌ట్టుగా ప్ర‌చారం ప్రారంభించాడు. త‌ను కంప్లైంట్ కూడా ఇవ్వ‌కుండా ఆమె బంధువుల‌తోనే ఇప్పించాడు. ఎవ‌రూ ప‌ట్టించుకోరు అనుకున్నాడో ఏమో కానీ.. విచార‌ణ కొన‌సాగే స‌రికి అస‌లు క‌థ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇంత ప్లాన్డ్ గా చేసినా అత‌డిని ప‌ట్టించ‌డంలో సీసీ కెమెరాలు కీల‌క పాత్ర పోషించాయని పోలీసులు క‌థ‌నాన్ని బ‌ట్టి స్ప‌ష్టం అవుతోంది. ఆమె ఇంట్లోకి వ‌చ్చిన వీడియో ఉంది కానీ, ఆమె బ‌య‌ట‌కు వెళ్లిన‌ట్టుగా వాటిల్లో రికార్డు కాలేద‌ట‌! అక్క‌డే నిందితుడిపై అనుమానాలు మొద‌ల‌య్యాయి. అలాగే అత‌డు హ‌డావుడిగా ఇంట్లోంచి అనేక సార్లు బ‌య‌ట‌కు వెళ్లి వ‌స్తూ ఉండ‌టంతో మ‌రింత ముదిరాయి అనుమానాలు. ఆ త‌ర్వాత పోలీసులు త‌మ‌దైన శైలిలో విచార‌ణ సాగించే స‌రికి మొత్తం క‌థ బ‌య‌ట‌ప‌డ్డ‌ట్టుగా ఉంది. అయితే ఆమె కు సంబంధించి ఎలాంటి ఆన‌వాలూ ఇప్ప‌టి వ‌ర‌కూ దొర‌క‌లేదు!

అనేక క్రైమ్ సినిమాలు చూసిన త‌ర్వాత అర్థం అయ్యేది ఏమిటంటే.. ఆమె శ‌వం ఆన‌వాలు అయినా ఇప్పుడు పోలీసుల‌కు దొర‌కాలి. డీఎన్ఐ టెస్టు ద్వారా ఆమె హ‌త్య జ‌రిగిన‌ట్టుగా పోలీసులు ధ్రువ‌ప‌ర‌చాలి. ఆ త‌ర్వాత అత‌డు చేసిన ఘాతుకాన్ని కోర్టులో పోలీసులు రుజువు చేయాలి. అయితే ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కూ హ‌త్య కావింప‌బ‌డ్డ మ‌హిళ అనవాలే దొర‌క‌డం లేద‌ట‌. అంత ప్లాన్డ్ గా అత‌డు చేశాడు, సీసీ కెమెరాలే ప‌ట్టించాయి.

5 Replies to “మీర్ పేట కిరాత‌కం.. ల‌భించ‌ని ఆమె ఆన‌వాలు!”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. ముందుగా కుక్క ను నరికాడు.

    తరువాత భార్యను నరికాడు

    అప్పుడెప్పుడో కుక్కని చంపి.

    తరువాత బాబాయిని వేసేసిన గుర్తు.

    భలే ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు వీడు.

    గొప్పోళ్ళు రా నాయనా మీరు

  3. ముందుగా కు*క్క ను నరికాడు.

    తరువాత భార్యను నరికాడు

    అప్పుడెప్పుడో కు*క్కని చం*పి.

    తరువాత బాబాయిని వేసేసిన గుర్తు.

    భలే ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు వీడు.

    గొప్పోళ్ళు రా నాయనా మీరు

  4. వైఎస్ఆ*ర్ మ*రణం కూడా ఇం*తవరకు చెపిం*చన ఇం*టి దొం*గ దొరకలేదు.

    వైఎస్ఆ*ర్ ఫ్యా*న్స్ కి బా*ల్స్ లేవు, వుంటే సీ*బీఐ ఎం*క్వైరీ అడిగేవారు.

Comments are closed.