వైసీపీలో కొర‌వ‌డిన స‌మ‌న్వ‌యం!

వైసీపీ దారుణ ఓట‌మిని మూట‌క‌ట్టుకున్నా, ఇంకా ఆ పార్టీలో స‌మ‌న్వ‌యం లేదు.

వైసీపీ దారుణ ఓట‌మిని మూట‌క‌ట్టుకున్నా, ఇంకా ఆ పార్టీలో స‌మ‌న్వ‌యం లేదు. 151 సీట్ల నుంచి 11 సీట్ల‌కు ప‌డిపోయిన వైసీపీ, ఇక నుంచైనా జాగ్ర‌త్త‌గా న‌డుచుకోవాల‌నే ఆలోచిస్తున్న‌ట్టు లేదు. విద్యార్థుల ఫీజు బ‌కాయిలు రూ.4 వేల కోట్లు చెల్లించాలంటూ ఫీజు పోరు పేరుతో ఆందోళ‌న కార్య‌క్ర‌మానికి వైఎస్ జ‌గ‌న్ పిలుపు ఇచ్చారు. అయితే విద్యార్థుల ఫీజు పోరు విష‌యంలో వైసీపీలో భిన్నాభిప్రాయాలున్నాయి.

ఈ కార్య‌క్ర‌మాన్ని ఇప్ప‌ట్లో వుంద‌ని వైసీపీలో ఎక్కువ మంది నాయ‌కుల అభిప్రాయం. కానీ జ‌గ‌న్ వాళ్ల అభిప్రాయాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా, త‌న‌కు తానుగా పిలుపు ఇచ్చారు. గ‌త నెలాఖ‌రులో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల్సి వుండింది. స‌రే, నాయ‌కుడు చెప్పారు కాబ‌ట్టి త‌ప్ప‌దు క‌దా అని ఫీజు పోరుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లున్నాయ‌నే కార‌ణంతో వాయిదా వేశారు.

ఈ నెల 29న నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. మ‌ళ్లీ ఆ కార్య‌క్ర‌మాన్ని రేపు నెల ఐదో తేదీకి వాయిదా వేశారు. దీంతో ప్ర‌భుత్వం మేల్కొంది. వైసీపీకి అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో పెండింగ్ ఫీజులో కొంత మొత్తాన్ని చంద్ర‌బాబు స‌ర్కార్ చెల్లించింది.

ఇక వైసీపీకి విమ‌ర్శించ‌డానికి కూడా ఏమీ లేదు. అయిన‌ప్ప‌టికీ ముందుగా ఇచ్చిన పిలుపు కావ‌డంతో రేపు నెల‌లో త‌ప్ప‌నిస‌రిగా ఆందోళ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల్సి వ‌స్తోంద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. వైసీపీ ప్లానింగ్ ఇట్లా వుంటుంద‌నే విమ‌ర్శ‌లు సొంత పార్టీ నేత‌ల నుంచి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

14 Replies to “వైసీపీలో కొర‌వ‌డిన స‌మ‌న్వ‌యం!”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.