సిటిజన్ షిప్ కోసం కడుపు ‘కోత’

ట్రంప్ ఇచ్చిన గడువు లోపే పిల్లల్ని కనేందుకు చాలామంది భారతీయ జంటలు ఇప్పుడు సిజేరియన్లు (సి-సెక్షన్) వైపు మొగ్గుచూపుతున్నారు.

ఇలా అధికారం చేపట్టిన వెంటనే అలా జన్మతః వచ్చే పౌరసత్వాన్ని (బర్త్ రైట్ సిటిజన్ షిప్) రద్దు చేశారు ట్రంప్. అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, 127 ఏళ్లుగా వస్తున్న ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికే వివాదాస్పదమైంది. 22 రాష్ట్రాలు, పలు పౌర హక్కుల సంఘాలు దీనిపై కోర్టుకు వెళ్లాయి. కోర్టులో ఏం జరుగుతుందనే విషయాన్ని పక్కనపెడితే, ట్రంప్ పెట్టిన గడువు సమీపిస్తున్నకొద్దీ చాలామందిలో భయాలు ఎక్కువయ్యాయి.

మరీ ముఖ్యంగా హెచ్1బీ, ఎల్1 వీసాలపై అమెరికాలో ఉంటున్న ఎన్నో భారతీయ కుటుంబాలు ఇప్పుడు గందరగోళంలో పడ్డాయి. తమకు పౌరసత్వం లేకపోయినా, అమెరికా గడ్డపై పుట్టే తమ బిడ్డలకు ఆటోమేటిగ్గా పౌరసత్వం వస్తుందని ఇన్నాళ్లూ వాళ్లు కలలుకన్నారు. ఒక్క సంతకంతో ట్రంప్ దాన్ని రద్దు చేశాడు.

దీంతో, ట్రంప్ ఇచ్చిన గడువు లోపే పిల్లల్ని కనేందుకు చాలామంది భారతీయ జంటలు ఇప్పుడు సిజేరియన్లు (సి-సెక్షన్) వైపు మొగ్గుచూపుతున్నారు. ఫిబ్రవరి 20లోపు తమకు పిల్లలు పుట్టాలని ఈ మేరకు సిజేరియన్ చేయాలంటూ చాలామంది భారతీయ మహిళలు డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఇలా హాస్పిటల్ కు వచ్చే భారతీయ మహిళల సంఖ్య గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోంది.

ఆ తేదీలోపు జన్మిస్తే పుట్టిన బిడ్డలకు అమెరికా పౌరసత్వం ఉంటుంది. లేదంటే 21 ఏళ్లు వచ్చేసరికి వాళ్లు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ గ్యాప్ లో తండ్రి లేదా తల్లికి పౌరసత్వం లేదా గ్రీన్ గార్డ్ వస్తే ఓకే.

ప్రస్తుతం 8వ నెలతో ఉన్న ఎంతోమంది భారతీయ గర్భిణులు తమకు సిజేరియన్ చేయాల్సిందిగా హాస్పిటల్ లో అంగీకార పత్రాలిస్తున్నారు. 7 నెలల గర్భంతో ఉన్నవాళ్లు కూడా హాస్పిటల్స్ కు రావడం ఎక్కువైందంటున్నారు వైద్యులు.

ఇలా ముందుగానే పిల్లలకు జన్మనిస్తే, వాళ్లలో ఊపిరితిత్తుల సమస్యలు, ఫీడింగ్ సమస్యలు, తక్కువ బరువు సమస్యలు తలెత్తుతాయని వైద్యులు కాబోయే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

హెచ్1బీ, ఎల్1 వీసాలపై అమెరికాలో ఉంటున్న భారతీయుల సంఖ్య లక్షల్లో ఉంది. ఇన్నాళ్లూ వాళ్లు బర్త్ రైట్ సిటిజన్ షిప్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్లంతా స్వచ్ఛందంగా స్వదేశానికి తిరిగి రావాలి లేదా యుఎస్‌ఏలో ఉండటానికి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి.

1868 లో జన్మతః పౌరసత్వాన్ని తెరపైకి తెచ్చారు. అమెరికాలో 14 మిలియన్ల మధ్య చట్టవిరుద్ధంగా నివశిస్తున్నారు. వాళ్లకు పిల్లలు పుడితే, ఆటోమేటిగ్గా వీళ్లంతా అమెరికన్ పౌరులుగా మారిపోతారు. దీన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు.

ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉపయోగించి పౌరసత్వం నియమాలు మార్చడానికి ఈ వందేళ్లలో ఏ అధ్యక్షుడు ప్రయత్నించలేదు/సాహసించలేదు. ట్రంప్ మాత్రం దీన్ని కెలికారు. ఏకంగా సుప్రీంకోర్టుతో ఢీకొట్టడానికి రెడీ అయ్యారు.

ఒకవేళ జన్మతః పౌరసత్వాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు నిర్ణయిస్తే, ట్రంప్ రాజ్యాంగ సవరణకు వెళ్లాల్సి ఉంటుంది. అలా చేయాలంటే రెండు చట్ట సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఈ ప్రక్రియకు సంవత్సరాల సమయం పడుతుందనే విషయం ట్రంప్ కు తెలుసు. అయినప్పటికీ ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. 1992 తర్వాత అమెరికా రాజ్యాంగాన్ని ఇప్పటివరకు సవరించలేదు.

8 Replies to “సిటిజన్ షిప్ కోసం కడుపు ‘కోత’”

  1. మనుగడ కోసం మాతృత్వాన్ని ఫణంగా పెట్టి చరితార్థులు అవుతారన్నమాట! సెహబాష్!

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  4. ప్రెగ్నెన్సీ 39 వారాలు నిండకముందు USA లొ ఏ డాక్టరూ వాళ్ళు అడిగారని సిజేరియన్ చెయ్యరు. 39 వారాలు నిండాక కూడా మెడికల్లీ అవసరం అయితే తప్ప చెయ్యరు మనమెంత మొత్తుకున్నా

  5. ప్రెగ్నెన్సీ 39 వారాలు నిండకముందు ఊశా లొ ఏ డాక్టరూ వాళ్ళు అడిగారని సిజేరియన్ చెయ్యరు. 39 వారాలు నిండాక కూడా మెడికల్లీ అవసరం అయితే తప్ప చెయ్యరు మనమెంత మొత్తుకున్నా

Comments are closed.