రాజకీయంగా పరిస్థితులు బాగున్నప్పుడు వారసులకు పట్టాభిషేకం చేయడం తెలివైన పని. ముందు చూపున్న అధినేత ఎవరైనా ఇదే పని చేస్తారు. లేదంటే జాతీయస్థాయిలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీకి ఏర్పడిన దుస్థితిని ఉదాహరణగా చెప్పుకోవాల్సి వుంటుంది. యూపీఏ పదేళ్ల పాటు అధికారంలో ఉండగా, రాహుల్‌గాంధీని కనీసం కేంద్ర మంత్రిగా కూడా చేయలేదు. పరిపాలన అనుభవం లేకుండా రాహుల్‌ను సోనియా తయారు చేశారన్న విమర్శ వుంది. రాహుల్‌ను ప్రధాని చేయకుండా సోనియా తప్పు చేశారన్న భావన కాంగ్రెస్‌లో వుంది.
ఇప్పుడు లోకేశ్ విషయంలో కూడా చంద్రబాబు కూడా సోనియా గాంధీలా తప్పు చేస్తున్నారన్న చర్చ టీడీపీలో అంతర్గతంగా వుంది. ఇప్పుడు టీడీపీ రాజకీయంగా చాలా మంచి స్థితిలో వుంది. పటిష్టమైన అధికార బలం, అలాగే లోకేశ్‌ను వారసుడిగా ప్రకటించాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది. పార్టీలో మెజార్టీ నాయకులు కోరుకున్నప్పుడే పట్టాభిషేకం చేస్తే బాగుంటుంది. అలా కాకుండా తాము కోరుకున్నప్పుడు జరగాలంటే, పరిస్థితులు సహకరించకపోవచ్చనే చర్చ టీడీపీలో సాగుతోంది.
ఇవేవీ చంద్రబాబుకు తెలియవని కాదు కానీ, మరెందుకనో పెద్దాయన భయపడుతున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు. ఏదో ఒకరోజు లోకేశ్‌కు బాధ్యతలు అప్పగించిక తప్పదని, ఇప్పుడే ఆ పని ఎందుకు చేయకూడదనేది టీడీపీలో మెజార్టీ వాదన. ఇప్పుడు కాకపోతే, భవిష్యత్‌లో ఏమవుతుందో చెప్పలేమని టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవని, రానున్న ఎన్నికల్లో రాజెవరో, మంత్రెవరో చెప్పలేమని కూడా టీడీపీ నేతలు అంటున్నారు. కావున టీడీపీకి అనుకూలమైన రాజకీయ పరిస్థితులు ఉన్నప్పుడే లోకేశ్‌కు పట్టాభిషేకం చేయడం సముచితమనే తమ అభిప్రాయాన్ని చంద్రబాబు పరిగణలోకి తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు.
పార్టీ అధికారంలో లేకపోతే, చంద్రబాబు మాట వినే పరిస్థితి వుండదని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో చంద్రబాబు నిర్ణయం ఎలా వుంటుందో అనే ఉత్కంఠ టీడీపీలో చూడొచ్చు.
మొత్తానికి ఈ సంవత్సరమే మంట రాజేసి చలి కాచు కోవాలి అనుకుంటున్నావు అన్న మాట! నువ్వు సూపర్ ఏహేయ్ ! Cooperation lo non-cooperation అంటే ఇదే
మొత్తానికి మీ అన్న jagan పులివెందులకు పరిమితం అంటావ్ అంతేనా ?
పులివెందుల next SC reserved anta ? మరి ఇంకో ప్లేస్ లో గెలిచే సీన్ ఉందా మీ anna కు ?
వాళ్ళ లెక్కలేవో వాళ్లకుంటాయ్ కానీ,
మనోడు Free గా ఉన్నాడు కదా అని A1పుల్లలు పెట్టడం ఆపి.. పెళ్లిడుకొచ్చిన “పిల్లకి పెళ్లి” చేసుకోమను.. లేచిపోయింతర్వాత బాధ పడితే లాభం ఉండదు.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
అయినా ఏ మాత్రం సిగ్గు లేకుండా ఇంకా ఈ ఛీదర ఛేష్టలేంట్రా…?
చూడబోతే మీ మఠాలన్నీ కలిసి జగ్గప్పకి వచ్చేసారికి ఇప్పుడున్న రెండు ఒక్కట్లలో కనీసం ఒక ఒక్కటినన్నా లేకుండా చేయడానికి గట్టిగనే కంకణం కట్టుకున్నట్టున్నది…