80 కోట్ల మేరకు దొరికిన లావాదేవీలు?

ఆ సంస్థ ఈ లావాదేవీలు అన్నింటికీ బదులు చెప్పాల్సి ఉంటుంది. కారణాలు చూపించాల్సి ఉంటుంది.

టాలీవుడ్‌ను ఐటీ సోదాల వ్యవహారం కుదిపేస్తోంది. ముఖ్యంగా ఓ సంస్థలో జరిగిన సోదాల్లో, ఒకరి దగ్గర ఫోన్‌లో ఎక్సెల్‌ షీట్‌ దొరికిందన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఆ ఎక్సెల్‌ షీట్‌లో 2020 నుంచి ఇప్పటి వరకు ఉన్న లావాదేవీలు లేదా 2020-21 మధ్యలో జరిగిన లావాదేవీలు ఉన్నాయి.

ఇండస్ట్రీలోని చాలా నోటెడ్‌ సంస్థల పేర్లు ఇందులో ఉన్నాయని తెలుస్తోంది. వైట్‌ ఇవ్వడం, బ్లాక్‌ తీసుకోవడం లేదా బ్లాక్‌ ఇవ్వడం, వైట్‌ తీసుకోవడం వంటి ఈ లావాదేవీలు చాలా పెద్ద ఎత్తున జరిగినట్లు తెలుస్తోంది. వీటి మొత్తం విలువ 80 కోట్లకు పైగానే ఉందని తెలుస్తోంది.

ఇప్పుడు రెండు సమస్యలు. ఒకటి, ఆ సంస్థ ఈ లావాదేవీలు అన్నింటికీ బదులు చెప్పాల్సి ఉంటుంది. కారణాలు చూపించాల్సి ఉంటుంది. రెండవది, ఈ లావాదేవీల్లో పాల్గొన్న నిర్మాణ సంస్థలు అన్నింటి మీదా ఇప్పుడు ఆదాయపన్ను శాఖ అధికారుల కన్ను పడుతుంది. కచ్చితంగా ఆ సంస్థల అకౌంట్లు చూడడం లేదా ఆ సంస్థలకు నోటీసులు ఇవ్వడం తప్పనిసరిగా జరుగుతుంది.

టాలీవుడ్‌లో వరుసపెట్టి సినిమాలు యుద్ధ ప్రాతిపదికన నిర్మించే ఓ వెల్‌ నోటెడ్‌ సంస్థ పేరు ఈ లావాదేవీల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకెవరి పేర్లు ఉన్నాయి? ఏం జరుగుతోంది అని ఆరా తీయడంలో బిజీగా ఉన్నారు సినిమా నిర్మాతలు అంతా.

9 Replies to “80 కోట్ల మేరకు దొరికిన లావాదేవీలు?”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.