లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌తో డీటీసీపై వేటు!

ర‌వాణాశాఖ‌లో త‌న కిందిస్థాయి మ‌హిళా ఉద్యోగుల్ని లైంగికంగా వేధిస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌పై క‌డ‌ప డీటీసీ చంద్ర‌శేఖ‌ర‌రెడ్డిపై సంబంధిత‌శాఖ మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి బ‌దిలీ వేటు వేశారు.

ర‌వాణాశాఖ‌లో త‌న కిందిస్థాయి మ‌హిళా ఉద్యోగుల్ని లైంగికంగా వేధిస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌పై క‌డ‌ప డీటీసీ చంద్ర‌శేఖ‌ర‌రెడ్డిపై సంబంధిత‌శాఖ మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి బ‌దిలీ వేటు వేశారు. క‌డ‌ప‌లో మ‌హిళా బ్రేక్ ఇన్‌స్పెక్ట‌ర్ ఇంటికి వెళ్లి మ‌రీ వేధించిన డీటీసీకి బాధితురాలి భ‌ర్త, కుటుంబ స‌భ్యులు దేహ‌శుద్ధి చేయ‌డంపై క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

ఈ ఘ‌ట‌న‌పై మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి సీరియ‌స్ అయ్యారు. జిల్లా అధికారిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తూ, మ‌హిళా ఉద్యోగుల‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ‌డాన్ని ఏ మాత్రం స‌హించేది లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. బాధిత మ‌హిళ‌ల‌కు అండ‌గా ప్ర‌భుత్వం వుంటుంద‌న్నారు. వెంట‌నే స‌ద‌రు అధికారిని రాష్ట్ర క‌మిష‌న్ కార్యాల‌యంలో రిపోర్ట్ చేసేలా మంత్రి ఆదేశించారు.

అధికారి తీరుపై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టేందుకు సీనియ‌ర్ అధికారిని నియ‌మిస్తామ‌న్నారు. ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తేలితే క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి హెచ్చ‌రించారు. డీటీసీ చంద్ర‌శేఖర్‌రెడ్డి గ‌తంలో ప‌ల్నాడు జిల్లాలో ప‌ని చేస్తున్న‌ప్పుడు కూడా ఇలాంటి ఆరోప‌ణ‌లే వ‌చ్చాయి.

తాజాగా కడ‌ప డీటీసీగా ప‌ని చేస్తూ, మ‌హిళా ఉద్యోగుల‌కు అస‌భ్య మెసేజ్‌లు పెట్ట‌డం, అలాగే కాల్స్ చేస్తూ వేధిస్తున్నార‌నే ఫిర్యాదులున్నాయి. ఒక మ‌హిళా ఉద్యోగిని కుటుంబం ప‌క్కా ప్లాన్‌తో అత‌నికి దేహ‌శుద్ధి చేసి, త‌గిన బుద్ధి చెప్పారు. ఇప్పుడ‌త‌న్ని అక్క‌డి నుంచి విజ‌య‌వాడ‌కు పంపారు.

2 Replies to “లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌తో డీటీసీపై వేటు!”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.