తన అసిస్టెంట్ తో పోటీ పడుతున్న విష్ణు

మెలోడ్రామా భలేగా వుంటుంది. ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుని, కొత్త ఈక్వేషన్లు పుడతాయో తెలియదు. మంచు విష్ణు ఢీ సినిమా చేస్తున్నపుడు ఓ కొత్త కుర్రాడు అసిస్టెంట్ గా చేరాడు. దాదాపు సినిమా పూర్తయ్యే…

మెలోడ్రామా భలేగా వుంటుంది. ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుని, కొత్త ఈక్వేషన్లు పుడతాయో తెలియదు. మంచు విష్ణు ఢీ సినిమా చేస్తున్నపుడు ఓ కొత్త కుర్రాడు అసిస్టెంట్ గా చేరాడు. దాదాపు సినిమా పూర్తయ్యే సమయానికి చిన్న చిన్న ఇగో సమస్యలు వచ్చాయి. ఆ కుర్రాడు బయటకు వచ్చేసాడు.

కట్ చేస్తే, అదృష్టం వరించింది..హీరో అయిపోయాడు. అవ్వడమే కాదు, మంచి టాలెంట్ వుందీ అని ప్రూవ్ చేసుకున్నాడు. అతగాడే నాని. ఇప్పుడు నాని నటించిన భలే భలే మగాడివోయ్ సినిమా సెప్టెంబర్ 4న విడుదలవుతోంది. ఆ సినిమా కు పోటీగా విడుదలవుతోంది విష్ణు నటించిన డైనమేట్.

ఆ వేళ్ల హీరో..అసిస్టెంట్..ఇప్పుడు ఇద్దరు పోటా పోటీ హీరోలు. ఎలా వుంటుందో చూడాలి మరి.