చిరంజీవి.. అంతా బుస్‌!

చిరంజీవి తన 150వ చిత్రం గురించి ప్రిపేర్‌ అవడానికి ఒళ్లు తగ్గించే పనిలో పడ్డాడని, చాలా కిలోల బరువు తగ్గి స్లిమ్‌గా అయిపోయాడని, త్వరలోనే సెట్స్‌ మీదకి వెళ్లేంత ఫిట్‌గా మెగాస్టార్‌ ఉరకలేస్తున్నాడని రకరకాల…

చిరంజీవి తన 150వ చిత్రం గురించి ప్రిపేర్‌ అవడానికి ఒళ్లు తగ్గించే పనిలో పడ్డాడని, చాలా కిలోల బరువు తగ్గి స్లిమ్‌గా అయిపోయాడని, త్వరలోనే సెట్స్‌ మీదకి వెళ్లేంత ఫిట్‌గా మెగాస్టార్‌ ఉరకలేస్తున్నాడని రకరకాల కథనాలు వినిపించాయి. కానీ అదంతా బుస్‌ అని మా టీవీ ఈవెంట్‌లో చిరంజీవిని చూస్తే తెలిసింది. 

చిరంజీవి ఎప్పటిలానే ఉన్నారు కానీ ప్రత్యేక కసరత్తులు చేస్తూ శరీరం మీద శ్రద్ధ పెడుతున్నట్టయితే కనిపించలేదు. ఆయనలో గమనించదగ్గ మార్పులేం లేవు కాబట్టి సదరు ప్రిపరేషన్స్‌ అన్నీ మీడియా కల్పితమే అని స్పష్టమైంది. చిరంజీవికి వాళ్లు కథ రెడీ చేసారు, వీళ్లు చేస్తున్నారు అంటూ తరచుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 

అయితే ఈ నూట యాభైవ చిత్రంపై చిరంజీవికే అంతగా ఆసక్తి ఉన్నట్టు లేదు. లేదంటే ఈపాటికే తన సినిమాని పట్టాలెక్కించేసి ఉండేవారు. ఎందుకో ఆయన మళ్లీ నటించడానికి వెనుకాడుతూ… కథ దొరకడం లేదనే సాకునే రిపీట్‌ చేస్తున్నారు. మరో ఆరు నెలల్లో అరవయ్యేళ్లు నిండిపోతాయి కనుక ఇక చిరంజీవి నుంచి హీరోయిజం ఎక్స్‌పెక్ట్‌ చేయనక్కర్లేదేమో!