మంచు ఫ్యామిలీలో ఓ ఆనవాయితీ ఉంది. తమ్ముడితో సినిమా తీస్తే అన్నతో అన్నతో సినిమా తీస్తే తమ్ముడితో.. జతకట్టేస్తుంటారు. ఇప్పుడు జి.నాగేశ్వరరెడ్డి అలాంటి జాక్ పాట్ కొట్టాడు. విష్ణు – నాగేశ్వరరెడ్డి కాంబినేషన్ లో దేనికైనా రెడీ తీశాడు. ఆ తరవాత తమ్ముడు మనోజ్‌తో కరెంటు తీగ తీశాడు. ఈ రెండు సినిమాలూ కమర్షియల్‌గా బాగానే వర్కవుట్ అయ్యాయి.
ఇప్పుడు మళ్లీ కరెంట్ తీగ కాంబినేషన్ సెట్స్‌పైకి వెళ్లింది. మనోజ్ కథానాయకుడిగా నాగేశ్వరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో మొదలైంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదో యాక్షన్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. కథానాయిక, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుస్తాయి.