తెలుగునాట రొమాంటిక్ హీరో ఎవరంటే నాగార్జున పేరే చెబుతారంతా! యాభై పైబడినా నాగ్ ఇంకా మన్మధుడే. ఇప్పుడు అఖిల్ కీ అలాంటి ఇమేజ్ క్రియేట్ చేయబోతున్నాడు వి.వి.వినాయక్. సాధారణంగా వినాయక్ సినిమాలంటే యాక్షన్ హోరు. ఆయన కథలన్నీ పగ, ప్రతికారాల నేపథ్యంలో సాగుతాయి. హీరోని రొమాంటిక్గా చూపించడం తక్కువే.
కానీ అఖిల్ సినిమా కోసం తన ధోరణికి భిన్నంగా ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తీస్తున్నాడట. ఈ సినిమాతో వినాయక్ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయిక కూడా ఫిక్సయిపోయింది. దిలీప్ కుమార్ మనవరాలు సాయేషా సైగల్తో అఖిల్ జోడీ కడుతున్నాడు. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలానే ఉంటాయట.
అఖిల్ – సాయేషాల మధ్య ఓలిప్ లాక్ సీన్ కూడా ఉందట. ఇదంతా.. అఖిల్ ని రొమాంటిక్ హీరోగా చూపించే ప్రయత్నమే. అన్నప్రాసన రోజే… అఖిల్ ఆవకాయ్ ముద్ద(ద్దు) రుచి చూపిస్తాడన్నమాట. మొత్తానికి వెండి తెర వేడెక్కడం ఖాయం.