ప్రేమలో పడ్డవాళ్లు చెప్పుకునే కబుర్లకు కథ, స్క్రీన్‌ప్లే ఉండదు. అందుకే వాటిని స్వీట్ నథింగ్స్ అంటారు. అలాగే కాలేజీ డ్రాప్ఆవుట్స్ లేదా అప్పుడే కాలేజీ నుంచి బయటకు వచ్చిన కుర్రాళ్లు చెప్పుకునే కబుర్లకు ఓ స్కీమ్, స్క్రీన్‌ప్లే ఉండవు. లింకులు, లాజికులు ఉండవు. ఓన్లీ వన్ లైన్ పంచ్‌లు, నవ్వులు. ఒకరిపై ఒకరు వేసుకునే పంచ్‌లు ఒక్కోసారి హద్దులు దాటినా లైట్ తీసుకోవడం ఆ వయసు అలవాటు. ఇలాంటివన్నీ కలిపి చేసినట్లు కనిపిస్తోంది ఈ వారం విడుదలవుతున్న మ్యాడ్ స్క్వేర్ సినిమా.
మ్యాడ్ 1 లో కాలేజీలో ముగ్గురు-నలుగురు ఫ్రెండ్స్ హడావుడి, హంగామా. అదే ఫ్రెండ్స్ ఓ పెళ్లిలో కలిస్తే, ఓ గోవా టూర్లో కలిస్తే ఉండే రచ్చ మ్యాడ్ స్క్వేర్. ట్రైలర్ అదే చెబుతోంది.
నలుగురు ఫ్రెండ్స్‌లో ఒకరి పెళ్లి. ఆ పెళ్లిలో మిగిలిన ముగ్గురి లొల్లి. ఆ తర్వాత అందరూ ఛలో గోవా. అక్కడ చేసే పిచ్చిపనులు, పర్యవసానాలు. ఈ కుర్రాళ్లు పోలీస్ గెటప్‌లు కూడా వేశారని అంటే ఏదో ఉంది విషయం.
ట్రైలర్లో హీరోయిన్లు, లేడీ క్యారెక్టర్లకు ప్రాధాన్యత లేదు. అంతా మేల్ మ్యాడ్నెస్. దర్శకుడు కళ్యాణ్ రాసిన చాలా పంచ్‌లు దొర్లాయి ట్రైలర్లో. వాటిలో చాలా వరకు పండాయి కూడా. వీలైనంత వరకు కట్ చేసిన సీన్లు అన్నీ ఒక సింక్‌లో ఉండేలా చూసుకున్నారు. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే.
Average movie