వ‌ప‌న్‌కు చెక్ పెట్టేందుకు వ‌ర్మ మాస్ట‌ర్ ప్లాన్‌!

కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు చెక్ పెట్టేందుకు టీడీపీ ఇన్‌చార్జ్ వ‌ర్మ వ్యూహం ర‌చిస్తున్నారు.

కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు చెక్ పెట్టేందుకు టీడీపీ ఇన్‌చార్జ్ వ‌ర్మ వ్యూహం ర‌చిస్తున్నారు. పొత్తులో భాగంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ విజ‌యం కోసం ప‌ని చేసినా, క‌నీసం విశ్వాసాన్ని జ‌న‌సేన చూప‌లేద‌ని వ‌ర్మ ర‌గిలిపోతున్నారు. దీనికి తోడు ఇటీవ‌ల పిఠాపురంలో జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో నాగ‌బాబు కామెంట్స్‌, ర‌గులుతున్న వ‌ర్మ‌పై ఆజ్యం పోసిన‌ట్టైంది.

ఈ నేప‌థ్యంలో వ‌ర్మ ప్ర‌జ‌ల్లో విస్తృతంగా తిర‌గాల‌ని నిర్ణ‌యించుకున్నారు. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు సాధించ‌డం ద్వారా, ప్ర‌జ‌ల‌తో నేరుగా సంబంధం లేని ప‌వ‌న్‌కు చెక్ పెట్టాల‌ని వ‌ర్మ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. నియోజ‌కవ‌ర్గంలోని కొమ‌ర‌గిరిలో ఆయ‌న ప‌ర్య‌టించారు. వైసీపీ హ‌యాంలో కాకినాడ నియోజ‌కవ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అక్క‌డ ఇంటి స్థ‌లాలు ఇవ్వాల‌ని అనుకున్నార‌ని, కానీ ఆ ప‌ట్టాల‌న్నింటిని ర‌ద్దు చేస్తామ‌ని వ‌ర్మ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

త‌మ నియోజ‌క‌వ‌ర్గంలోని స్థ‌లాన్ని ఇత‌రుల‌కు ఇవ్వ‌డాన్ని అంగీక‌రించేది లేద‌ని ఆయ‌న అన్నారు. ఇదే విష‌య‌మై డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు లేఖ రాశాన‌ని, దాన్ని ఆయ‌న క‌లెక్ట‌ర్‌కు పంపార‌ని వ‌ర్మ చెప్పుకొచ్చారు. త‌ద్వారా వ‌ర్మ పిఠాపురం నియోజ‌కవ‌ర్గంలో సొంత ఇమేజ్‌ను పంచుకునే ప్ర‌య‌త్నాల్ని మొద‌లు పెట్టారు. వ‌ర్మ‌కు చాప‌కింద నీరులా టీడీపీ అధిష్టానం కూడా స‌హ‌క‌రిస్తోంద‌నే ప్ర‌చారం కాకినాడ జిల్లా వ్య‌ప్తంగా జ‌రుగుతోంది.

ఇటీవ‌ల పిఠాపురంలో వ‌ర్మ వ‌ర్సెస్ జ‌న‌సేన అన్న‌ట్టు రాజ‌కీయం న‌డుస్తోంది. వ‌ర్మ అంటే జ‌న‌సేన నాయ‌కులు నిప్పులు చెరుగుతున్నారు. ఇదే సంద‌ర్భంలో వ‌ర్మ కూడా రాజ‌కీయంగా వ్యూహాత్మ‌కంగా ప‌వ‌న్‌కు చెక్ పెట్టేలా పావులు క‌దుపుతున్నారు. రానున్న రోజుల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌కూడ‌ద‌ని, ఆ పార్టీకి వ్య‌తిరేకంగా ఏ ర‌కంగా పోటీ చేసినా త‌నే గెల‌వాల‌నే ముందు చూపుతో వ‌ర్మ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

కాకినాడ వాసుల‌కు త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో ఇచ్చిన ఇంటి స్థ‌లాల‌ను ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం ద్వారా, అక్క‌డ జ‌న‌సేన‌ను దెబ్బ‌తీయొచ్చ‌ని వ‌ర్మ అభిప్రాయంగా క‌నిపిస్తోంది. ఎందుకంటే కాకినాడ ఎంపీగా జ‌న‌సేన నాయ‌కుడు, ప‌వ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడైన ఉద‌య్ గెలుపొందారు. వ‌ర్మ‌కు ఉద‌య్‌తో మొద‌లైన గొడ‌వ‌… చివ‌రికి మెగా బ్ర‌ద‌ర్స్ వ‌ర‌కూ దారి తీసింది. అందుకే ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న చందంగా… త‌న‌కు గిట్ట‌ని జ‌న‌సేన నేత‌లంద‌రినీ చావు దెబ్బ తీసేందుకు వ‌ర్మ భారీ ప్లానే వేశారు. దాన్ని ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌డ‌మే, జ‌న‌సేన‌కు భ‌విష్య‌త్‌లో ప్ర‌మాదం పొంచి వుంద‌నే హెచ్చ‌రిక పంపుతోంది.

22 Replies to “వ‌ప‌న్‌కు చెక్ పెట్టేందుకు వ‌ర్మ మాస్ట‌ర్ ప్లాన్‌!”

  1. కొమరగిరి అసెంబ్లీ పరంగా పిఠాపురం, పార్లమెంట్ పరంగా కాకినాడ నియోజకవర్గం…..కాకినాడ ఎంపీ ని దెబ్బ తియ్యడానికి కాకినాడ వాసులు పట్టాలు పిఠాపురం లో ఇచ్చినవి కాన్సుల్ చేస్తామని వర్మ గారు ప్రకటించడం ఏమిటి…. రెండు ప్రాంతాలు అదే ఎంపీ ఉదయ్ గారి అండర్ లో వస్తాయి…. కాకినాడ పార్లమెంట్ నియోజికవర్గంలో పిఠాపురం తో సహా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి …..యో…. చూసుకోబల్లే…..

    1. Adhe yeekagadu independent ka kuda gelichadu. 2 places lo defeat aina Yeeka gadu evado, Oka rendu parties support lekunda gelavaleni sannasi evado andharuku telusu. Just 4 years, Me yeekagadu malli 2 places search chesukoli.

  2. గెలిచే వరకూ వర్మ ఉపయోగపడ్డాడు. పవన్ గెలిచాక y cp కేడర్ అంతా జెఎస్పీ లో జాయిన్ అయిపోయారు. Y సిపి కేడర్ జాయిన్ అయ్యాక ఇప్పుడు వీళ్లకి వర్మ అవసరం లేదు. అందుకే ఇతనికి పొమ్మన కుండా పొగ పెడుతున్నారు.

    1. న్యూడ్ కాల్ చేస్తా >>> తొమ్మిది, సున్నా, ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది

    1. కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. 2004 నుంచి టిడిపి గెలిచింది లేదు వర్మాకా అంత సీన్ లేదు నువ్వు ఏటీఎం గ్రేట్ ఆంధ్ర నువ్వు ఇలా సంతోషపడాలి

    1. వర్మకు అంత సీన్ లేదా? 2014 లో 40 వేల మెజారిటీ తో.. అది కూడా ఇండిపెండెంట్ గా… మీ మొఖాలకి కాపు ఓట్లు ఎక్కడున్నాయో వెతుక్కొని పోటీ చేసే మీకు రాష్ట్రం, అన్ని కులాలు ఎప్పటికీ సపోర్ట్ చెయ్యవ్… Dcm MLA కూడా అవ్వలేడు..

Comments are closed.