క‌డ‌పలో వైసీపీకి టీడీపీ ఝ‌ల‌క్!

అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు ఏమైన‌ప్ప‌టికీ, న్యాయ స్థానం నిర్ణ‌యంపై ఉత్కంఠ నెల‌కుంది.

క‌డ‌ప జెడ్పీ చైర్మ‌న్ స్థానాన్ని కైవ‌శం చేసుకోవాల‌ని టీడీపీకి బ‌ల‌మైన కోరిక వుంది. అయితే ఆ పార్టీ ఆశించిన స్థాయిలో వైసీపీ నుంచి ఫిరాయింపులు లేవు. దీంతో అధికారంలో వుండి, పోటీ చేసి ఓడిపోయామ‌నే అప్ర‌తిష్ట కంటే, పోటీ నుంచి త‌ప్పుకోవ‌డ‌మే మంచిద‌ని ఆ పార్టీ అనుకుంది. అయితే తాజాగా ఆ పార్టీ వ్యూహం మార్చి, వైసీపీకి ఝ‌ల‌క్ ఇచ్చింది. క‌డ‌ప అంటే …వైఎస్సార్ కుటుంబానికి రాజ‌కీయ అడ్డా అనే పేరు వుంది.

అలాంటి చోట వైసీపీని ఎలాగైనా ఇర‌కాటంలో నెట్టాల‌నేది టీడీపీ వ్యూహం. ఈ నేప‌థ్యంలో టీడీపీకి కేవ‌లం ఆరుగురు స‌భ్యుల బ‌లం మాత్ర‌మే వుండ‌డం, వైసీపీకి 42 మంది మ‌ద్ద‌తు వుండ‌డంతో అధికార కూట‌మి ప‌న్నాగాలు పార‌లేదు. అయితే రాజీనామాతో ఒక స్థానం, జెడ్పీటీసీ స‌భ్యుడి మృతితో మ‌రో స్థానం ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలు ఉండ‌డంతో టీడీపీ మ‌న‌సులో మెరుపులాంటి ఆలోచ‌న క‌లిగింది.

రెండుస్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా, జెడ్పీ చైర్మ‌న్‌కు ఎన్నిక జ‌రిగితే తాను న‌ష్ట‌పోతాన‌ని బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గంలోని గోప‌వ‌రం జెడ్పీటీసీ సభ్యుడు జ‌య‌రామ్‌రెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించారు. 27న జెడ్పీ చైర్మ‌న్ ఎన్నిక జ‌ర‌గాల‌ని ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ ఇచ్చింద‌ని, తాను బ‌రిలో నిల‌వాల‌ని అనుకుంటున్నాన‌ని, అయితే రెండు స్థానాలు ఖాళీగా ఉన్న నేప‌థ్యంలో ఎన్నిక జ‌ర‌ప‌డం స‌రైంది కాద‌ని ఆయ‌న హైకోర్టులో పిటిష‌న్ వేశారు.

దీంతో క‌డ‌ప జెడ్పీ చైర్మ‌న్ స్థానాన్ని నిలుపుకున్నామ‌ని సంబ‌ర‌ప‌డుతున్న వైసీపీకి షాక్ ఇచ్చిన‌ట్టైంది. జెడ్పీటీసీల‌ను ప్ర‌లోభ పెట్టే క్ర‌మంలో కోర్టుకెక్క‌డం ద్వారా స‌మ‌యం ల‌భిస్తుంద‌ని టీడీపీ వ్యూహంగా క‌నిపిస్తోంది. అయితే వైసీపీ స‌భ్యుల్ని టీడీపీ వైపు తిప్పుకోవ‌డం ప్ర‌స్తుతానికైతే సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. ఒక‌వేళ కోర్టులో టీడీపీకి అనుకూల నిర్ణ‌యం వెలువ‌డితే, ఇదే కార‌ణంతో వైసీపీ రాష్ట్ర‌మంతా వెళుతుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు అంటున్నారు.

కేవ‌లం క‌డ‌ప‌ను దృష్టిలో పెట్టుకుని న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యిస్తే, రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో తాము కూడా అదే పంథాను అనుస‌రిస్తామ‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు ఏమైన‌ప్ప‌టికీ, న్యాయ స్థానం నిర్ణ‌యంపై ఉత్కంఠ నెల‌కుంది.

11 Replies to “క‌డ‌పలో వైసీపీకి టీడీపీ ఝ‌ల‌క్!”

        1. Parvaledu raa..cbn gaadu pothe Oka Donga edupu edusthaaru le janalu..badapadaku..

          aa matram cheyaleraa vaadi dusta palana nundi vimukthi kosam😂🤣

  1. రాష్ట్రమంతా ఇదే స్టాండ్ తో వుంటే ఎక్కడా వైసిపి గెలిసే పరిస్థితే లేదు లేపి తన్నిచ్చుకోవటం వైసిపి కి అలవాటే

  2. రాష్ట్రము మొత్తం ఇలా జరిగితేనే తెలుగు దొంగలా పార్టీ కి బుద్ది వస్తది జై జగన్

Comments are closed.