ఆ హెచ్చ‌రిక పోలీసుల‌కు అనుకుంటున్నారా లోకేశ్‌?

ఉన్న‌తాధికారుల మెప్పుకోసం నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తే, మీరే ఇబ్బండి ప‌డాల్సి వ‌స్తుంద‌ని పోలీసుల‌ను ఏపీ హైకోర్టు హెచ్చ‌రించింది.

పోలీసుల‌పై ఏపీ హైకోర్టు విరుచుకుప‌డింది. ఉన్న‌తాధికారుల మెప్పుకోసం నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తే, మీరే ఇబ్బండి ప‌డాల్సి వ‌స్తుంద‌ని పోలీసుల‌ను ఏపీ హైకోర్టు హెచ్చ‌రించింది. పోలీసుల తీరు చూస్తుంటే త‌మ‌కు బీపీ పెరుగుతోంద‌ని ఏపీ హైకోర్టు ధ‌ర్మాస‌నం ఘాటు వ్యాఖ్య చేసింది.

ప్రభుత్వాన్ని వ్యంగ్యంగా విమర్శించినందుకు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారంటూ కేసు పెడతారా? అరెస్టు సమయంలో రూ.300 దొరికాయంటారా? అని జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, జస్టిస్‌ కుంభజడల మన్మథరావు ధర్మాసనం ఆశ్చ‌ర్యం వ్యక్తం చేసింది. పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, ఇలా చేస్తే సమస్యలపై సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ధ‌ర్మాస‌నం హెచ్చ‌రించ‌డం కేవ‌లం పోలీసుల‌కు అనుకుంటే పొర‌పాటే.

నిజానికి ఈ హెచ్చ‌రిక ప్ర‌భుత్వానికే అనే చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. ముఖ్యంగా రెడ్‌బుక్ పేరుతో మంత్రి నారా లోకేశ్ ప్ర‌త్య‌ర్థుల్ని టార్గెట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వైసీపీ హ‌యాంలో కీల‌కంగా ప‌ని చేసిన మాజీ మంత్రులు, నాయ‌కుల‌పై వ‌రుస కేసులు, అరెస్ట్‌లు రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్ర‌భుత్వ పెద్ద‌ల మెప్పుకోసం పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపుతున్నార‌ని ప్ర‌త్య‌ర్థులు ఇప్ప‌టికే ఆరోప‌ణ‌లు చేశారు.

ముఖ్యంగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌మ వాళ్ల‌పై అక్ర‌మ కేసులు పెడుతున్న పోలీస్ అధికారులు, రిటైర్ అయి స‌ప్త స‌ముద్రాల ఆవ‌త‌ల ఉన్నా, చ‌ట్ట ప్ర‌కారం శిక్షిస్తామ‌ని హెచ్చ‌రించారు. మ‌రోవైపు రెడ్‌బుక్‌కు ప్ర‌జామోదం వుంద‌ని లోకేశ్ అంటున్నారు. పోలీసుల తీరు చూస్తుంటే, త‌మ‌లో బీపీ పెరుగుతోంద‌నే హైకోర్టు ధ‌ర్మాస‌నం కామెంట్స్‌ను కూట‌మి స‌ర్కార్ సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం వుంది. అక్ర‌మ కేసులు ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తీసుకొస్తున్నాయ‌ని ఏపీ హైకోర్టు షాకింగ్ కామెంట్స్‌తో మంత్రి నారా లోకేశ్ గ్ర‌హిస్తే మంచిది.

సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వ అప్ర‌జాస్వామిక విధానాల‌పై వ్య‌తిరేక పోస్టులు పెట్టినంత మాత్రాన కేసుల‌తో భ‌య‌పెట్టాల‌నే ప్ర‌య‌త్నాల్ని ప్ర‌భుత్వం విర‌మించుకోవాలి. విమ‌ర్శ‌ల్లో స‌హేతుక‌త వుంటే, వాటిని ప్ర‌భుత్వం స‌రిదిద్దుకుంటే మంచిది. అందుకు విరుద్ధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని టెర్ర‌రైజ్ చేయాల‌ని అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తే, రాజ‌కీయంగా న‌ష్ట‌పోయేది తామే అని కూట‌మి పెద్ద‌లు గ్ర‌హించాలి. ప్ర‌స్తుతం హైకోర్టు కామెంట్స్‌తో ప్ర‌భుత్వం మేల్కొంటే మంచిది. లేదంటే ప్ర‌జాకోర్టులో ప్ర‌భుత్వం దోషిగా నిల‌బ‌డాల్సి వ‌స్తుంది. హైకోర్టు హెచ్చ‌రిక‌… రాబోయే ప్ర‌మాదాన్ని సూచిస్తోంది.

8 Replies to “ఆ హెచ్చ‌రిక పోలీసుల‌కు అనుకుంటున్నారా లోకేశ్‌?”

  1. అబ్బో….గత ప్రభుత్వం లో డీజీపీ, cs పలు మార్లు స్వయంగా కోర్టు హాజరై తిట్లు తిన్నారు….అప్పుడు ఎవరికో చెప్పలేదు హెచ్చరికలు?

  2. e court kakapothe aa court,

    high court kakapothe suprem court

    mukul rohgath, ram jatmalani lanti lawers petti vadistha mayya

    anina jagan anna ni suprem, vanda mottilayalu yesindi taggada?

    asalu taggada?

    sodi cheppmaku reddy

    1. రామ్ జఠ్మలానీ చివరకు.. సచ్చిపోయాడు ర.. మీ C@సులు వాదించి వాదించి..కొత్త లాయరునీవెతుక్కో!

    1. ఆ ప్రజాకోర్టులో.. ఇక.. బాలట్ ఎన్నికలే.. మిషన్లు వద్దు ఇక చాలు అంటే.. మాత్రం.. ఇక మీకు కష్టమే రోయ్ !

Comments are closed.