మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైల్స్ దగ్గం కావడానికి సంబంధించిన వ్యవహారాన్ని ఇంత వరకూ నిగ్గు తేల్చకపోవడం చర్చనీయాంశమవుతోంది. గత వైసీపీ పాలనలో ముఖ్య నాయకులు తమ భూదందాలు బయటపడతాయనే భయంతో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లను కాల్చివేశారని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఆరోపించిన సంగతి తెలిసిందే.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించి వెంటనే అక్కడికి వెళ్లి ఏం జరిగిందో చూడాలని డీజీపీ, సీఐడీ చీఫ్‌లను ఆదేశించారు. ఉన్నతాధికారులు వెంటనే హెలికాఫ్టర్‌లో మదనపల్లెకు చేరుకుని, విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ కమిటీని కూడా వేసింది.
ఈ ఘటనకు సంబంధించి ఒకరిద్దర్ని అరెస్ట్ చేయడం, అలాగే రెవెన్యూ అధికారుల్ని సస్పెండ్ చేయడం మినహా, ఇంత వరకూ అసలేం జరిగిందో తేల్చలేని దయనీయ స్థితిలో కూటమి సర్కార్ వుంది. పది నెలల క్రితం ప్రధానంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేంద్రంగా సీఎంతో పాటు ప్రభుత్వ ముఖ్య నాయకులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఎంతసేపూ ప్రత్యర్థుల్ని నైతికంగా బద్నాం చేయాలనే ప్రయత్నం తప్ప, వాటికి సంబంధించి ఆధారాల్ని బయట పెట్టే పరిస్థితి కనిపించడం లేదు.
తాజాగా కలెక్టర్లు, రెవెన్యూ అధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భూవివాదాలన్నింటినీ ఏడాదిలోగా పరిష్కరించాలని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అక్రమాల వల్లే ప్రజల్లో అభద్రతా భావం ఏర్పడిందన్నారు. అయితే తమ ప్రభుత్వం బయటపెట్టిన అక్రమాలేంటో ఆయన చెప్పలేకపోవడం గమనార్హం.
అలాగే ఇదే సమావేశంలో సీఎస్ విజయానంద్ కూడా రెవెన్యూ సమస్యలపై కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 2024 జూన్ 15 నుంచి 2025 మార్చి 19 వరకు ప్రజల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం 8,26,099 ఫిర్యాదులు వచ్చినట్టు చెప్పారు. వీటిలో 7,45,501 ఫిర్యాదుల్ని పరిష్కరించామన్నారు. అయితే మదనపల్లె ఫైల్స్ గురించి మాత్రం మాట్లాడకపోవడం గమనార్హం.
Where comments
nuvvu pettavu kadha ..
sab ka number ayega reddy!!!
మదనపల్లి ఫైల్స్ అవసరం లేదు. మొత్తం టీం లిక్కర్ స్కాం లో అడ్డంగా దొరికింది . ఇక దబిడి దిబిడే .