వయసు 28.. ఆమె ఆస్తుల విలువ అక్షరాలా 66 కోట్ల రూపాయలు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, రష్మిక ప్రస్తుతం నికర ఆస్తుల విలువ 66 కోట్ల రూపాయలు. ఇండియా వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం ఒక్కో సినిమాకు 4 కోట్ల నుంచి 8 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటోంది. సౌత్ లో తక్కువగా, నార్త్ లో కాస్త ఎక్కువగా రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తోంది.
ఛావాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం సికిందర్ సినిమా రిజల్ట్ కోసం వెయిటింగ్. సల్మాన్ తో కలిసి చేసిన ఆ సినిమా కూడా హిట్టయితే రాబోయే రోజుల్లో రష్మిక ఆస్తుల విలువ 100 కోట్ల రూపాయలకు చేరుతుందని ఓ అంచనా.
కేవలం సినిమాలే కాకుండా, ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది రష్మిక. ఇవి కాకుండా, ఆమె కొన్ని కాస్మోటిక్ ఉత్పత్తుల్లో పెట్టుబడులు పెట్టింది. వాటి ద్వారా కూడా గణనీయంగా ఆస్తులు సంపాదిస్తోంది.
ఆమెకు ముంబయి లో సొంత ఫ్లాట్ ఉంది. దీంతో పాటు హైదరాబాద్, బెంగళూరు, గోవా, కూర్గ్ లో కూడా ఆమెకు స్థిరాస్తులున్నాయి. సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం ఆమె స్థిరాస్తులపైనే పెడుతోంది. కొంత మొత్తాన్ని తన ఫ్యామిలీ బిజినెస్ లో కూడా వెచ్చిస్తోంది.
ఓవైపు పెట్టుబడులు పెడుతూనే, మరోవైపు లగ్జరీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తోంది. ఆమె దగ్గర ఆడీ, రేంజ్ రోవర్, బెంజ్ కు చెందిన ఖరీదైన కార్లు ఉన్నాయి. కెరీర్ ప్రారంభంలో ఎంతో ఇష్టంగా కొనుక్కున్న క్రెటా కారును కూడా ఆమె ఇంకా మెయింటైన్ చేస్తోంది. కాకపోతే దాన్ని గ్యారేజ్ కే పరిమితం చేసింది. మరోవైపు విదేశీ పర్యటనలు, విహార యాత్రలకు కూడా భారీగానే ఖర్చు పెడుతోంది రష్మిక.
devarakonda kosam emina dachipettinda leda