వైసీపీ అధికారంలోకి వస్తే, సొమ్ము చేసుకోడానికి చాలా మంది ముందుంటారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల్ని క్రమశిక్షణలో నడపడానికి మాత్రం…ఒకరిపై మరొకరు బాధ్యతలు మోపడానికి చాలా మంది ఉన్నారు. అలాగని తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో నాయకులెవరూ లేరా? అంటే… చాలా మందే ఉన్నారనే సమాధానం వస్తోంది. ఉన్నాడమ్మా మొగుడు గాజులకు అడ్డం అని మొరట సామెత చెప్పువాల్సి వుంటుందనే మాట వినిపిస్తోంది.
ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని చోట అవిశ్వాస తీర్మానాలు పెట్టడం, మరికొన్ని చోట్ల కొత్త వాళ్లను ఎన్నుకోడానికి ఎన్నిక ప్రక్రియ జరగనుంది. ఇందుకోసం వైసీపీ విప్ జారీ చేయాల్సి వుంది. సొంత పార్టీ వాళ్లకు కాకుండా, ఇతరులకు ఓటు వేస్తే అనర్హత వేటు వేస్తామని హెచ్చరించడం విప్ జారీ ప్రధాన లక్ష్యం.
అయితే ఈ ఎన్నికల గురించి చాలా ముందే తెలుసు. అయినప్పటికీ విప్ పత్రాలను సదరు ప్రాంతాలకు పంపడంలో మాత్రం వైసీపీ అధిష్టానం తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఎన్నిక రేపు వుందనగా, కేవలం ముందు రోజు రాత్రికి సదరు పత్రాల్ని పంపుతుండడంతో ఎన్నికల బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్న నాయకులు తీవ్ర ఆందోళనకు గురై, పార్టీ పెద్దలపై మండిపడుతున్నారు. ఇదేం పార్టీ అని తమ వాళ్లనే నిందిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యాన్ని ఎక్కడా చూడలేదని మండిపడుతున్నారు.
ఇదేనా పార్టీని నడిపే తీరు అంటూ కోపంతో నిలదీస్తున్నారు. విప్ జారీకి సంబంధించిన పత్రాల్ని వారం ముందే పంపితే, వచ్చే నష్టం ఏంటని నిలదీస్తున్నారు. రాజకీయాలు, అలాగే పార్టీని బలపరచాలనే సీరియస్‌నెస్ లేని వాళ్లని పెట్టుకున్న వైఎస్ జగన్‌ను తిట్టాలని క్షేత్రస్థాయిలో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ ఇట్లే చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు.
Vadu emi cheppi n aa evadu vinadu…Enduku time waste..paiga risk…dabbulu bok ka
కొద్దీ రోజుల్లో వైసీపీ నే మూత పడుతుంటే ఇంకా ఏంది రా బాబు మీ సొల్లు ఇక్కడ
మా అన్నయ్య కి ముఖ్యమంత్రి పదవే ముఖ్యం ఇలాంటి చిన్నా చితకా పదవులు ఎందుకు.
తీసుకున్న కూలికి సిన్సియర్ గా న్యాయం చేస్తున్నది ఒక్క great ఆంధ్రుడే.