ప‌వ‌న్ వినిపిస్తోందా.. విద్యార్థుల నిల‌దీత‌!

కేవ‌లం త‌మ‌ను మ‌భ్య పెట్ట‌డానికే ప్ర‌భుత్వం నాట‌కాలు ఆడుతోంద‌న్న ఆవేద‌న‌, ఆగ్ర‌హం వాళ్ల‌లో వ్య‌క్త‌మ‌వుతోంది.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై విద్యార్థుల్లో అభిమానం పోతోంది. అంతేకాదు, ఆయ‌న‌పై విద్యార్థుల్లో వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. అప్పుడు అలా అన్నావ్‌, ఇప్పుడేమో నోరు తెర‌వ‌లేదేం అని ప‌వ‌న్‌ను నిరుద్యోగ ఉపాధ్యాయులు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. ఏప్రిల్‌లో మెగా డీఎస్సీ నిర్వ‌హిస్తామ‌నే ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌పై నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో న‌మ్మ‌కం పోయింది. త‌మ‌ను ప్ర‌భుత్వం మోస‌గిస్తోంద‌నే భావ‌న వాళ్ల‌లో ఏర్ప‌డింది.

అందుకే ఉమ్మ‌డి కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ‌లో డీఎస్సీపై తేల్చి చెప్పాలని నిన‌దిస్తూ నిరుద్యోగ ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ముఖ్యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను వాళ్లు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిరుద్యోగ ఉపాధ్యాయుల‌కు హామీ ఇచ్చారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే డీఎస్సీ నిర్వ‌హిస్తామ‌ని ప‌వ‌న్ హామీ ఇవ్వ‌డాన్ని ఇప్పుడు వాళ్లు ఆయ‌న‌కు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, హామీ అమ‌లుకు నోచుకోవ‌డం లేద‌ని, ఎందుకు మౌనంగా ఉన్నావ‌ని ప‌వ‌న్‌ను నిల‌దీయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

టాలీవుడ్ అగ్ర‌హీరోగా యువ‌త అభిమానాన్ని ప‌వ‌న్ చూర‌గొన్నారు. సినిమాల్లో మాదిరిగానే, రియ‌ల్ లైఫ్‌లో కూడా ప‌వ‌న్ మాట‌పై నిల‌బడుతార‌ని యువ‌త న‌మ్మింది. మ‌రీ ముఖ్యంగా డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌పై ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. హామీ ఇచ్చిన‌ట్టుగానే సీఎం చంద్ర‌బాబునాయుడు మొద‌టి సంత‌కం మెగా డీఎస్సీ ఫైల్‌పై చేశారు. కానీ డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌కు నోచుకోవ‌డం లేదు.

ఏదో ఒక సాకుతో రోజురోజుకూ ఆల‌స్యం చేస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో స‌హ‌జంగానే అనుమానాలు త‌లెత్తుతున్నాయి. కేవ‌లం త‌మ‌ను మ‌భ్య పెట్ట‌డానికే ప్ర‌భుత్వం నాట‌కాలు ఆడుతోంద‌న్న ఆవేద‌న‌, ఆగ్ర‌హం వాళ్ల‌లో వ్య‌క్త‌మ‌వుతోంది. ఉపాధ్యాయ పోస్ట్ పొందేందుకు నెల‌ల త‌ర‌బ‌డి అవ‌నిగ‌డ్డ లాంటి చోట కోచింగ్ తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్ర‌తినెలా వేలాది రూపాయిలు ఖ‌ర్చు అవుతోంది. మ‌రోవైపు ఎదురు చూపులు త‌ప్పే, క‌నుచూపు మేర‌లో ప్ర‌భుత్వం డీఎస్సీ నిర్వ‌హించేలా క‌నిపించ‌డం లేద‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అందుకే అంతా రోడ్డెక్కారు. ప్ర‌భుత్వాన్ని, ముఖ్యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను నిల‌దీయ‌డం వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శనం.

9 Replies to “ప‌వ‌న్ వినిపిస్తోందా.. విద్యార్థుల నిల‌దీత‌!”

  1. Vaadini blue fox cbn gaadu eppudo Kerala assam Russia pampu gaadu..

    AP ki vasthe kakinada Donga export lekkalu lekapothe kerala..

    inkekkada ee DSC Bongu boshanam..

  2. అధికారం లోకి వచ్చిన వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పలేదు కదా GA…..april లో పెడతామని CM announce చేశాక కూడా యెందుకు GA ఈ యెడుపు ….

    1. అధికారం లోకి వస్తే మొదటి సంతకం DSC మీదనే పేడత అనడు…మన డబ్బా cm, అది తెలుసా నీకు…అధికారం రావడానికి ఎవడి దైనా … ఏమైనా చేసే అలవటు ఉన్నాడు…చెప్పాడు..జరా పోయి అడుగు…

      1. Ante cbn gaadu free bus annadu… inka DSC , …Singapore in mirror development… employment ekkada ?

        ippatiki cbn gaadi govt 90, 900 crores appu. I

        parvaledu.. cbn gaadu ante aa matram deceitful activities undali..anthe gaa

  3. వైఎస్ జగన్ గాడు గత 5సం”లలో మెగా డీఎస్సీ అని నిరుద్యోగుల ఆశలు ఆవిరి చేశాడు అప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు చెప్పలేదు

  4. అసలు అయిదు సంవత్సరాలలో ఒక్క dsc నోటిఫికేషన్ కూడా మీ నాయకుడిని కనుక్కో వినిపిస్తుందో లేదో. SC వర్గీకరణ వలన లేట్ అయింది. నిన్ననే కదా చంద్రబాబు గారు ఏప్రిల్ first week లో నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పారు కదా

Comments are closed.