“గ్లింప్స్ నేను చూశాను. అద్భుతంగా ఉంది. మరీ ముఖ్యంగా అందులో ఒక షాట్ కోసం టీజర్ ను ప్రతి ఒక్కరు కనీసం వెయ్యి సార్లు చూస్తారు.” రామ్ చరణ్ కొత్త సినిమా గ్లింప్స్ పై నిర్మాత రవిశంకర్ కామెంట్ ఇది.
ఇంత హైప్ ఇచ్చిన ఈ నిర్మాత, అది రేపు రిలీజ్ అవుతుందా అవ్వదా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయాడు. గ్లింప్స్ లో చిన్న ఆడియో ప్రాబ్లమ్ వచ్చిందని, అది సకాలంలో పరిష్కారం అవుతుందా అవ్వదా అనేది అప్పుడే చెప్పలేమన్నాడు. అన్నీ ఇష్యూస్ క్లియర్ అయితే రేపు సాయంత్రానికి గ్లింప్స్ రావొచ్చు.
అయితే మరో క్లారిటీ మాత్రం ఇచ్చారు నిర్మాత. రేపు రామ్ చరణ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ తో పాటు, ఆ సినిమా టైటిల్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాదు, విడుదల తేదీని కూడా రేపే ప్రకటించబోతున్నారు. ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలిచ్చిన రవిశంకర్, గ్లింప్స్ పై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రెహ్మాన్ సంగీత దర్శకుడు.
Call boy jobs >>> 7997531004