ప్రైవేటుగా మాట్లాడుకోవడానికి, పబ్లిక్ గా మాట్లాడడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. దానినే మనం సభ్యత అంటాము. కానీ చాలా మంది ప్రముఖులు కూడా కొన్ని సందర్భాల్లో అలాంటి హద్దుగీతను మిస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ విషయంలో జరిగింది కూడా అదే.
రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ లో ఆయన అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యల కారణంగా.. పనిగట్టుకుని సారీ కూడా చెప్పాల్సి వచ్చింది. చేసిన వ్యాఖ్యలేమో సరదాగా చేసినవి. కానీ.. వాటి పర్యవసానం ఎలా ముదురుతున్నదో తెలిసిన తర్వాత.. రాజేంద్రప్రసాద్ సీరియస్ గా సారీ చెప్పాల్సి వచ్చింది. దీనినే ‘అడుసు తొక్కనేల.. కాలు కడగనేల’ అంటారు పెద్దలు. నరం లేని నాలుకపై అదుపు తప్పితే ఇదే జరుగుతుంది.
ఆత్మీయంగా ఉండేవాళ్లు, క్లోజ్ ఫ్రెండ్స్ సరదాగా బూతులు, అసభ్య భాషలో తిట్టుకోవడం చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి సినిమా రంగంలో ఇలాంటి ‘క్లోజ్ నెస్’ చాలా త్వరగా ఏర్పడిపోతుంటుంది. పైగా అలాంటి చిన్న చిన్న బూతులు, అసభ్య భాషలో తిట్టడం ద్వారానే దగ్గరితనాన్ని పెంచుకుంటూ ఉంటారు. రాజేంద్రప్రసాద్ చేసింది కూడా అదే.
తిట్టు సంగతి పక్కన పెడితే.. క్రికెట్ ఆడమంటే.. పుష్పలాగా భుజం పెట్టి రీల్స్ చేస్తాడా? డేవిడ్ వార్నరుకు ఇదే నా వార్నింగ్ అంటూ రాజేంద్రప్రసాద్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు అచ్చంగా సరదాగా చేసినవి మాత్రమే. ఇలాంటి వికట సరదాలు సినిమా పరిశ్రమలో, వేదికల మీద అప్పటికప్పుడు పుట్టే ప్రేమలను కురిపించుకోవడంలో చాలా సహజం. రాజేంద్రప్రసాద్ కూడా అంతవరకు పరిమితమై ఉంటే.. ఆయన వ్యాఖ్యలను అందరూ ఎంజాయ్ చేసి ఉండేవారు. సర్కాస్టిక్ గా భావించేవారు. ఆ ఒక్క పదం తిట్టడంలో తిట్టడం అనేది ఆయన ఉద్దేశం కాదు.. విన్నవారికి కూడా అలా అనిపించి ఉండదు.
కానీ ఇవాళ్టి సోషల్ మీడియా తాటాకులు కట్టేయడానికి రెడీగా కాచుకుని ఉంటుంది. ఇలాంటి వికటమీడియా పోకడలు విశృంఖలం అవుతున్న వేళ.. మాటలకు హద్దు ఎక్కడిదాకా ఉండాలో రాజేంద్రప్రసాద్ గుర్తుపెట్టుకుని ఉండాలి. ఆయన అది మిస్సయ్యారు.
అందుకే ఇవాళ సారీ చెప్పాల్సి వచ్చింది. ప్రెస్ మీట్ లో వెంకీ కుడుముల చెప్పిన ప్రకారం.. ఆయన రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలను వార్నర్ కు వివరించినప్పుడు.. అది దురుద్దేశంతో కాదని అన్నప్పుడు.. వార్నర్ చాలా హుందాగా స్పందించినట్టు తెలుస్తోంది. క్రికెట్ లో స్లెడ్జింగ్ తమకు అలవాటేనని, సినీ రంగంలో ఇది స్లెడ్జింగ్ అనుకుంటానని అన్నట్టుగా తెలుస్తోంది.
రాజేంద్రప్రసాద్ మాత్రమే కాదు, వేదికలెక్కి మాట్లాడే స్థాయి ఉన్న వారు మాత్రమే కాదు, సామాన్యులు కూడా ఈ పాఠం నేర్చుకోవాలి. ప్రెవేటు సంభాషణల్లో ఎంత సరదాగా అయినా తిట్టుకోవచ్చు. నలుగురిలో ఉన్నప్పుడు కొన్ని సరదాలు అసహ్యంగా ఉంటాయి.
ఏదో పెద్దాయన . వదిలేయండి
Great ఆంద్ర కాదు సైకో జగన్ సపోర్ట్ అని పేరు మార్చు కో వెంకట్ రెడ్డి
ఈ మధ్యలో…సినిమా వాళ్లకు ఎదుటి వ్యక్తులకు గౌరవం ఇవ్వడం ఇవ్వడం,గౌరవం తీసుకోవడం వంటివి మరచిపోయారు…! ఈ కల్చర్ ఈ మధ్య చాలా ఎక్కవ అయ్యింది