పార్టీ అంటూ అన్నాక అంతా కష్టపడాలి. పార్టీ నాది అనుకోవాలి. తగిన వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి. బాధ్యతలు అందుకున్న వారు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. అధినాయకత్వం ఇచ్చే ఆదేశాలను తుచ తప్పకుండా అనుసరిస్తూనే తాము కూడా తమ పరిధిలో స్ధానికంగా చేయాల్సిన కార్యక్రమాలను చేస్తూ జనంలో ఉండాలి. ప్రతీ పార్టీలో ఇదే జరుగుతుంది. కానీ వైసీపీ తీరు మాత్రం వేరుగా ఉంటుంది. ఆ పార్టీలో నాయకులు అంతా ఎవరికి వారుగానే ఉంటారు. కీలక స్ధానాలలో ఉన్న వారు జిల్లా సమస్యలను పక్కన పెట్టి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఎంత ఘాటుగా విమర్శిస్తే అంతా గొప్పగా ఉంటుందని భావిస్తారు. దాంతోనే విశాఖ వంటి ప్రతిష్టాత్మకమైన నగరంలో వైసీపీ చతికిలపడుతోంది. అవసరమైన సమయాలలో చేతులెత్తెస్తోంది.
విశాఖ నగరం అంటేనే తెలుగుదేశానికి పెట్టని కోట. ఆ పార్టీని విశాఖలో ఓడించడం బహు కష్టం. అది 2019లోనే రుజువు అయింది. విశాఖ జిల్లా సహా ఉత్తరాంధ్రా అంతటా వైసీపీ ప్రభంజనం బలంగా వీచినా కూడా విశాఖ నగరంలోని నాలుగు స్ధానాలను వైసీపీ గెలుచుకోలేకపోయింది. అక్కడ టీడీపీ జెండా గట్టిగానే పాతింది. అయితే వైసీపీ అధికారంలో ఉండడంతో 2021లో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్చార్జిగా నాడు పనిచేసిన వి విజయసాయిరెడ్డి కూడా పట్టుదలతో పనిచేసి విశాఖ మేయర్ పీఠాన్ని వైసీపీ పరం చేశారు. ఈ నేపధ్యంలో టీడీపీలోని కీలకమైన నాయకులను వైసీపీలోకి తీసుకురావడమే కాదు, పార్టీ బలహీనంగా ఉన్నచోట సరైన ఎత్తుగడలతో ముందుకు సాగడం వల్ల వైసీపీ నగరంలో జెండా ఎగురవేయగలిగింది.
నిజంగా ఆ బలాన్ని నిలుపుకుంటే వైసీపీకి 2023లో జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎన్నికలలో దారుణమైన ఓటమి ఉండేది కాదు, అదే విధంగా 2024 ఎన్నికలోనూ ఘోర పరాజయం కూడా జరిగేది కాదు. కానీ విశాఖను కేంద్రంగా చేసుకుని వైసీపీ పెద్దలు చేసిన ప్రయోగాల వల్ల పార్టీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. విజయసాయిరెడ్డిని తప్పించి వైవీ సుబ్బారెడ్డిని ఇన్చార్జిని చేసిన తరువాత వైసీపీలో వర్గపోరు బయటపడింది. విజయసాయిరెడ్డి తెచ్చిన నాయకులు పార్టీలో స్తబ్దుగా మారారు. ఆయన టిక్కెట్లు ఇప్పించి కార్పొరేటర్లుగా చేసిన వారు తరువాత కాలంలో వచ్చిన వైవీ సుబ్బారెడ్డితో కలసి పనిచేయలేకపోయారు. కీలకమైన నాయకులు కూడా వేరుగా ఉంటూ వచ్చారు. అందరినీ సమన్వయం చేసుకోవాల్సిన పార్టీ ముఖ్యలు పెద్దలు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించారు.
పార్టీలో ఉన్న వారికి బలమైన వారికి సరైన స్ధానం కల్పించడంలో అధినాయకత్వం ముందు ఎవరు ఏమిటి అన్నది వివరించడంలో పార్టీ బాధ్యులు విఫలం కావడంతో విశాఖలో వైసీపీ సాధించిన స్ధానిక విజయాలు అన్నీ తాత్కాలికం అయ్యాయి. అవే ఇపుడు ఆ పార్టీకి శాపాలుగా మారాయి. వైసీపీకి చెందిన కార్పోరేటర్లు కూటమిలోకి వెళ్లిపోతున్న నేపధ్యంలో వారిని ఆపి సర్దుబాటు చేయాల్సిన యంత్రాంగం పార్టీ వద్ద లేకపోవడం మరో లోటుగా ఉంది. అదే సమయంలో పార్టీలో ముఖ్య నాయకులు వీడిపోతున్నా చోద్యం చిత్తగించిన పరిస్థితి ఉంది. ఆ విధంగా వైసీపీ చేజేతులుగా విశాఖలో అంది వచ్చిన అవకాశాలను సొంతం చేసుకోలేక బలహీనపడుతూ వచ్చింది.
పార్టీకి జిల్లా బాధ్యులుగా ఉన్న వారిని పదే పదే మార్చడం ద్వారా అధినాయకత్వం కూడా సరైన దిశా నిర్దేశం చేయలేకపోయింది. గడచిన అయిదేళ్లలో చూసుకుంటే కనుక నలుగురైదుగురు పార్టీ జిల్లా అధ్యక్షులుగా మారారు. అలాగే ఉత్తరాంధ్రా రీజనల్ కో ఆర్డినేటర్లుగా ముగ్గురు ఇదే సమయంలో మారారు. అలాగే కీలకమైన నియోజకవర్గాలలో ఇన్చార్జిలను నియమించుకోలేని బలహీనతతో కూడా పార్టీ పడిపోయింది.
ఇక జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన వారు పార్టీకి సంబంధించి ప్రతీ నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించడం, ఎప్పటికపుడు పార్టీ నాయకులను శ్రేణులను అప్రమత్తం చేస్తూ ముందుకు నడిపించడం వంటివి చేయాలి. కానీ అవి పెద్దగా కనిపించడంలేదని పార్టీలోనే చెప్పుకుంటున్న పరిస్థితి. పార్టీలో ఎవరు కీలకం ఎవరు బాధ్యులు అన్నది కూడా తెలియనంత అయోమయంలో వైసీపీ శ్రేణులను ఉంచారన్నది కూడా ఒక విమర్శగా ఉంది.
విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ విశాఖ స్ధానిక సంస్ధల ప్రతినిధుల కోటా నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. ఆ లెక్కన ఆయన విశాఖ జిల్లా నాయకుడుగా ఉన్నారు. దాంతో ఆయన తరచూ విశాఖలోని తన సొంత కార్యాలయంలో మీడియా సమావేశాలు పెడుతూ హడావుడి చేస్తూంటారు. మరో వైపు పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాద్, కొత్తగా ఉత్తరాంధ్రా జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్‌గా నియమితులైన మాజీ మంత్రి కురసాల కన్నబాబు కూడా పార్టీ ఆఫీసులోనే కనిపిస్తారు.
ఇలా బహుళ నాయకత్వం విశాఖ వైసీపీలో ఉందన్న భావన ఏర్పడింది. అయితే ముందు నాయకుల మధ్య సమన్వయం రావాల్సి ఉందని అంటున్నారు. అదే సమయంలో మీడియా సమావేశాల కంటే పార్టీ సమావేశాల ద్వారా కార్యకర్తలను నాయకులను కలుస్తూ వారి సాధక బాధకాలను తెలుసుకుంటూ ఉంటే పార్టీ నేతలు కార్యకర్తలు కూడా నిబద్ధతతో ఉంటారు అని అంటున్నారు.
కీలకమైన స్ధానాలలో ఉన్న వారు ఎవరూ ఎవరికీ సంబంధం లేనట్లుగా వ్యవహరించడం వల్లనే ఈ రోజున వైసీపీలో ఉన్న దిగువ స్ధాయి నేతలు సైతం కూటమి వైపు చూస్తున్నారని అంటున్నారు. ఇదంతా స్వయంకృతమని చెబుతున్నారు. ఇప్పటికైనా నాయకులు అంతా సమిష్టిగా పనిచేసి పార్టీలోని వారిని కలుపుకుంటూ పోతేనే వైసీపీకి భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు.
అక్క ఆరాటమే కానీ ..
Vizag gurinchi marchipora GA. Adi Kootami adda. Vaadu capital chestha antene cheppu tho kotti pampincharu. that is the commitment of vizag to kootami.
Akka aaratam
9380537747 my number
Nud cal estanu >>> తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు.
వైసీపీ వైజాగ్ పదునైన అస్త్రం అని article రాసి పది గంటలు కాలేదు…ఇప్పుడే ప్లేట్ ఫిరాయించావ్ ఏందిరా రూథర్‌ఫోర్డ్?
ఒరేయ్ సన్నాసి ….2021స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ వ్యూహాత్మకంగా ఉందొ దౌర్జన్యంగా ఉందొ తెలుసులేరా?అందుకే 2024 ఎన్నికలలో ఆ వ్యూహాలు పనిచేయలేదు
Nee kastam paga vaadiki kuda raakudadu ra GA.
అపర నీ sollu కబుర్లు నువ్వు thokkalo balam undi dhaniki antha దొంగ తనం దొంగ otlu దొంగ నా dodukulu antha cheap party ni netthina పెట్టుకొని nuvvu raasey rathalu aa 11 mandi ki ఊరట ànthey roy , ఊహ ledu వాళ్ల నోటిలో dhummey ika ఎప్పటికీ . నోటి దూల అనుకుంటే కనీసం MLA అయినా ఉంటుంది లేకుంటే అది kuda maji ne ika




ఎంత torture raa vaadu vaadi కొవ్వు పరిపాలన yaaakkk
మూడు పార్టీల మీద పోరాటం అంటే అన్నీయ్య pubG ఆడినంత వీజ్రి అనుకున్నావా రా..టీడీపీ క్యాడర్ కాబట్టి మీరు అప్పట్లో Trs ని బీజేపీ ని అడ్డుపెట్టుకుని ఎంత హింసిం..చి…నా నిలబడ్డారు.
D reddy gaa du lopala daakkuni pee….dda uttaraalu raasi kasta adutinte…cader matram rodla.meeda tirag aalaa
..
Party annaka andharu kashtapadali
Adhikam vachhina tharuvatha mana langanna vokkade shikkati shirunavvu tho button lu nokkuthadu
Mana andagaadi andamains mokham choosi andaru votu vesaru ani mana langanna chebutjadu
Laila ni YCP ki head cheyalli – Avi ____dash
Laila ni Y C P ki head cheyalli – A v i ____d a s h
Nuvvu vellu GA .. Anni chakka diddi raa
మొన్న ..
కూటమికి చిక్కని వైసీపీ..
నిన్న..
వైసీపీ ప్రయోగిస్తున్న పదునైన అస్త్రం..
ఈ రోజు..
చేతులెత్తేస్తున్న వైసీపీ..
..
రేపు..
నిండా మునిగిపోయిన వైసీపీ..
Excellent.
ఎల్లుండి ” జ్ఞాపకాల దొంతర్లలో ” వైసీపీ క్యాడర్:)
వదిలిన బాణం, వదిలేసిన బాణం, విరిచేసిన బాణం లా అంటారా
నిన్నే కదరా కూటమికి చెక్ అని రాసావ్ అసలు మీరు ఎంత మంది ఆర్టికల్స్ రాస్తారు రా మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి మేము కూడా మా వ్యూస్ రాస్తాం
raalipoina aakuni enni sarlu chettuki athikistavura sannasi…
Party ledu bokka ledu dialogue gurtostondi