నటులు మందు కొట్టి ఈవెంట్స్ కు వస్తారా?

పరిశ్రమలో పార్టీలు కామన్. అలా తాగిన హీరోలు నోరుజారినా తెరవెనక మాత్రమే, స్టేజ్ పై ఇప్పటివరకు ఎప్పుడూ తూలలేదు.

డేవిడ్ వార్నర్ పై రాజేంద్రప్రసాద్ నోరు పారేసుకున్నారు. మరుసటి రోజు తప్పు తెలుసుకొని క్షమాపణలు కూడా చెప్పారు. ఇక్కడ మేటర్ అది కాదు. రాజేంద్రప్రసాద్ తాగి ఈవెంట్ కు వచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది నటులు తాగి ఫంక్షన్లకు వస్తారా? తాగితే తప్ప స్టేజ్ పై మాట్లాడలేరా? ఇదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కొంతమంది నటులు మద్యం సేవించి ఈవెంట్స్ కు వచ్చారనే అనుకుందాం? అందులో తప్పేంటని ప్రశ్నించేవాళ్లు కూడా ఉన్నారు. నిజమే.. అది వాళ్ల ఈవెంట్, వాళ్లిష్టం. తప్ప తాగి వస్తారు. అంతవరకు ఓకే. అలా తాగి వాగితేనే అసలు సమస్య.

కొన్నేళ్ల కిందట బాలకృష్ణ కూడా తన బ్రాండ్ పుచ్చుకొని మైక్ పుచ్చుకున్నారు. మహిళల్ని కించపరిచేలా మాట్లాడారు. అది పెద్ద వివాదమే రేపింది. ఆ తర్వాత ఆయన కూడా క్షమాపణలు చెప్పారు కానీ అంతవరకు పరిస్థితి ఎందుకొచ్చిందనేది ఇక్కడ ప్రశ్న.

బాలకృష్ణ కాబట్టి అంతే అనుకోవచ్చు. ఫంక్షన్ లో తను కూర్చున్న సోఫా పక్కనే మందు బాటిల్ పెట్టుకునేంత ధైర్యం ఆయనకుంది. పైగా తను తాగుతానని ఆయనే ఓపెన్ గా చెప్పుకుంటారు. మిగతా నటులు చెప్పుకోరు, కానీ దొరికిపోతుంటారు.

చాలా ఏళ్ల కిందట తనకు అవార్డ్ రాలేదని అక్కసుతో ఓ స్టార్ హీరో అర్థరాత్రి ఆక్రోషంతో ఓ ట్వీటేశాడు. కొన్ని గంటల్లోనే దాన్ని డిలీట్ చేశాడు. మందు కొట్టి ఆపుకోలేక అభ్యంతరకరంగా వేసిన ఆ ఒక్క పోస్టు టాలీవుడ్ సర్కిల్ లో అతడ్ని చులకన చేసింది. రీసెంట్ గా ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు మందు కొట్టి స్టేజ్ పైకొచ్చి మీడియాను ఇష్టమొచ్చినట్టు తిట్టాడు. ఈతరం యంగ్ హీరోల్లో 90 శాతం మద్యం తాగుతారు. అర్థరాత్రి ట్వీట్లు కూడా వేస్తుంటారు.

నిన్నటికినిన్న ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలిసి దిగిన ఫొటోలో కూడా వాళ్లిద్దరి మధ్య మందు గ్లాసు ఉంది. పరిశ్రమలో పార్టీలు కామన్. అలా తాగిన హీరోలు నోరుజారినా తెరవెనక మాత్రమే, స్టేజ్ పై ఇప్పటివరకు ఎప్పుడూ తూలలేదు.

మందు మనిషిని చిత్తు చేస్తుంది. నోటిపై నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. ఈ విషయం తెలిసి కూడా అలవాటు మానుకోలేని సెలబ్రిటీలు మన ఇండస్ట్రీలో కోకొల్లలు.

7 Replies to “నటులు మందు కొట్టి ఈవెంట్స్ కు వస్తారా?”

    1. ఇలా. చేసుకునే ఇంత వరకూ వచ్చారు సన్నాసులు. అవి నాషం బావ ఎలా పోలీసు లను బెదిరించి C B I మీద కేసులు వేయించింది నిన్న సుప్రీం లో afhdavit వేశారు. బావ కళ్ళలో ఆనందం చూదువు

  1. Cinema industry lo perfect candidate evaranna vunnaru ante adi Mega family okate. Discipline ante brothers ni choosi nerchukovali. Rest is all scrap.

  2. ee maata balakitti gaadini adugu..

    mandu , chukka , pakka leninde Vaadu kadaladu, vadalali..

    Nee tikka questions kakapothe..industry lo ladies kuda mandu kodutunnadu..Adi open gaa

    kondaru pub ki velli UGADI pachadi techukubtunnaru..

Comments are closed.