కమల హాసన్ రంగప్రవేశం చేసిన తొలి సినిమా ‘‘కళత్తూర్ కణ్ణమ్మ’’ (1960)లో హీరో జెమినీ గణేశన్. 40 ఏళ్ల వయసున్న హీరో, తన కొడుకుగా వేసిన ఆరేళ్ల బాలనటుణ్ని చూసి అసూయ పడడమేమిటి అంటే ఆ సినిమాలో కమల్ పాత్ర అలాటిది. ఎవిఎం సంస్థను 1945లో స్థాపించిన ఎవి మెయ్యప్పన్ చెట్టియార్ స్టూడియో నడుపుతూ పలు భాషల్లో సినిమాలు తీశారు. పోనుపోను భారం ఎక్కువై పోయి, ‘అన్నీ నేనే చూసుకోలేక పోతున్నాను. బెంగాలీ, సింహళం మానేస్తా’నంటే ఆయన భార్య రాజేశ్వరి ‘బికామ్ చదువుతున్న కొడుకుని మీ బిజినెస్ లోకి తెచ్చి సహాయకుడిగా పెట్టుకోవచ్చు కదా’ని సలహా యిచ్చింది. దాంతో ఆయన ఒకరొకరిగా కొడుకులందరినీ తన బిజినెస్‌లోకి తెచ్చి తర్ఫీదు యిప్పించాడు.
కొన్ని రోజులు పోయాక, ‘మీరే స్వయంగా కథను ఎంపిక చేసి, రాయించుకుని, నిర్మాణబాధ్యతలు తీసుకోవాలి. అప్పుడే యీ విద్య పట్టుబడుతుంది.’ అని చెప్పారు. అప్పుడు శరవణన్ సోదరులు కె కె ఎం నారాయణస్వామి రాసి, నటించిన ‘‘తిలకం’’ అనే నాటకం చూసి చాలా నచ్చి అదే పేరుతో సినిమా తీస్తామన్నారు. తండ్రి సరే అని మొత్తం బాధ్యత వాళ్లకే వదిలేశాడు. ప్రేమ్ నజీర్, ఎంఎన్ రాజం, శ్రీరంజనిలతో ప్రముఖ దర్శకద్వయం కృష్ణన్-పంజు దర్శకత్వంలో తీశారు. బొంబాయి నృత్యతార హెలెన్‌ను రప్పించి, ఆ డాన్సు దృశ్యాలను కలరులో తీశారు. ఇంత చేసినా సినిమా బాగా ఆడలేదు. అప్పుడు మెయ్యప్పన్ చెప్పాడు, ‘నాటకంలోని ఎఫెక్టులో 50శాతం మాత్రమే సినిమాల్లో వస్తుంది. సినిమాకు కథలు వేరేలా రాయించుకోవాలి’ అని!
రెండో సినిమాకు కథ గురించి వెతికారు. ఇలా వెతుకుతూండగానే ‘‘నటుడు, రచయిత జావర్ సీతారామన్ మీ నాన్నగారికి ఒక కథ చెప్తున్నారండి.’’ అని ఎవిఎం ఉద్యోగి వచ్చి చెప్పాడు. జావర్‌ను అడిగితే ‘నిజమే కథ నచ్చింది కానీ, మేం ఎవిఎంలో తీయలేం అన్నారు మీ నాన్నగారు, ఆ కథను వేరే నిర్మాతలకు చెప్పబోతున్నాను.’ అన్నాడు. వీళ్లు తండ్రి దగ్గరకు వెళ్లి ‘మాకు ఆ ఐడియా నచ్చింది. జావర్‌తో కలిసి బాగా వర్కవుట్ చేస్తాం. ఆయన్ని వెనక్కి రప్పించండి.’’ అన్నారు. ఆయన సరే కానీయమన్నాడు. ‘‘ద ఫర్‌గాటెన్ ఫ్యాక్టర్’’ అనే నాటకాన్ని, ‘‘నో బడీస్ చైల్డ్’’ అనే చైనా సినిమా కథను కలిపి జావర్ ‘‘కళత్తూర్ కణ్ణమ్మ’’ సినిమా కథను తయారు చేశారు. అదే ‘‘కళత్తూర్ కణ్ణమ్మ’’. తర్వాతి రోజుల్లో రివాజుగా మారిన యీ కథలో ఒక రైతు కూతురు, పట్నంలో విద్య నభ్యసిస్తూ తన గ్రామానికి తిరిగి వచ్చినపుడు విద్యావంతుడైన జమీందారు కొడుకుతో, అతను ఫలానా అని తెలియక, ప్రేమలో పడుతుంది. తర్వాత తెలిసి భయపడితే అతను ‘‘నేను పై చదువులకు విదేశాలకు వెళ్లి వచ్చాక, మా నాన్నను ఒప్పిస్తాను.’’ అని మాటిచ్చి గుళ్లో పెళ్లాడతాడు.
అతను వెళ్లాక యీమె గర్భవతి అని తెలుస్తుంది. అది తెలిసి, జమీందారు యీమెను కలిసి యీ విషయం ఎక్కడా చెప్పవద్దని కోరతాడు. ఈమె అతనికి మాటిచ్చి మౌనంగా ఉంటుంది. ఈ పాయింటే ప్రధానంగా అనుకుని సినిమాను 1962లో హిందీలో ‘‘మై చుప్ రహూంగీ’’,1969లో తెలుగులో ‘‘మూగనోము’’గా తీసినప్పుడు టైటిల్స్ ఆ విధంగా పెట్టారు. హీరోయిన్ తండ్రి కూతురు ప్రసవం జరిపించి, పుట్టిన బిడ్డను అనాథాశ్రమంలో చేర్పించి, కూతురితో బిడ్డ పుట్టగానే చనిపోయాడని చెప్తాడు. కూతురితో సహా ఊరు విడిచి వెళ్లిపోతాడు. ఆమె అనుకోకుండా తన కొడుకు స్కూల్లోనే టీచరుగా చేరి, అతనంటె మక్కువ పెంచుకుంటుంది. కొన్నేళ్లు గడిచాక విదేశాల నుంచి తిరిగి వచ్చిన కొడుక్కి జమీందారు హీరోయిన్ కులట అనీ, వేశ్యగా మారిందని చెప్తాడు. అతను విరక్తితో మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడతాడు. ఇంతలో కొడుకు తారసిల్లుతాడు. ఫలానా అని తెలియక పోయినా ప్రేమ పెంచుకుంటాడు. ఇలా కుర్రవాడు సినిమా కథకు కీలకమయ్యాడు. చివర్లో జమీందారు హీరోయిన్ త్యాగాన్ని మెచ్చి, కుర్రవాడు ఫలానా అని ప్రకటించి, కథను సుఖాంతం చేస్తాడు.
‘‘అమరదీపం’’ (1956) ‘‘ఉత్తమ పుత్రన్’’ (1958) సినిమాలతో పెద్ద డైరక్టరుగా పేరు తెచ్చుకున్న తాతినేని ప్రకాశరావుని దీనికి డైరక్టరు అనుకున్నారు శరవణన్ బ్రదర్స్. ఎవిఎం ఆస్థాన డైరక్టర్ల కంటె ఆయన పారితోషికం రెట్టింపైనా, కొడుకుల మాట తీసేయలేక చెట్టియార్ ఒప్పుకున్నాడు. కానీ ప్రకాశరావుకీ, ఆయనకీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. ఓ పాటలో హీరోయిన్ సావిత్రికి మంచి డ్రస్సు, మేకప్ దట్టించి గ్లామరస్‌గా చేయించారు ప్రకాశరావు. పట్నంలో చదివిన పిల్ల కదా అని ఆయన లాజిక్. ఎంతైనా రైతు కూతురికి అంత చేటు మేకప్ ఏమిటని మెయ్యప్పన్ అభ్యంతరం. తర్వాత అనాథ శరణాలయంలో కమలహాసన్‌పై తీసిన ‘‘అమ్మావుమ్ నీయే, అప్పావుమ్ నీయే..’’ పాట అక్కరలేదని ప్రకాశరావు ఉద్దేశం. నిర్మాత చెప్పగా పెట్టాడు కానీ 4 ని.ల పాటను ఒకటిన్నర ని.లకు కుదించాడు. ఓ పిల్లాడిపై పాటను జనం చూడరని ఆయన లాజిక్. కాదు, సెంటిమెంటు వర్కవుట్ అవుతుందని, పాట హిట్టవుతుందని మెయ్యప్పన్ ఉద్దేశం. ఆయన తన తొలి చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు కాబట్టి అనేక విషయాలపై పట్టు ఉంది.
దీనిపై వాదనలు జరగగానే ప్రకాశరావే మెయ్యప్పన్ వద్దకు వచ్చి ‘‘నేను తప్పుకుంటాను. మీరు వేరే వారిని పెట్టుకోండి.’’ అంటూ సామరస్యంగానే బయటకు వెళ్లిపోయాడు. దాదాపు సగం సినిమా తీయాల్సి ఉంది. అప్పుడు భీమ్‌సింగ్‌కి అప్పగించారు. ఎస్పీ ముత్తురామన్ అసిస్టెంటు డైరక్టరుగా కొనసాగాడు. ఈ పాటకు ఓ కథ ఉంది. సినిమా మ్యూజిక్ సంగతి శరవణన్ తమ్ముడు మురుగన్ చూసుకునే వారు. ఎవిఎంకు ఆస్థాన సంగీత దర్శకుడిగా ఆర్ ఎస్ సుదర్శనం అనే తెలుగాయన ఉండేవారు. ఆయన సినిమాలో ఒక పాటకు హిందీ సినిమా ‘‘అనాడీ’’లో పాట ట్యూన్ తీసుకుని మార్చి ఎడాప్ట్ చేశాడు. మురుగన్‌కు ఆ పద్ధతి నచ్చలేదు. ఈ పాటకు మీ సొంత ట్యూను యివ్వండి అని కోరాడు. ఏదీ కుదరకటం లేదు. సుదర్శనం బయటకు వెళ్లినప్పుడు వయొలనిస్టు మురుగన్ వద్దకు వచ్చి ఓ ట్యూను సజెస్ట్ చేశాడు. మురుగన్‌కు నచ్చింది, సుదర్శనమూ ఎప్రూవ్ చేశారు.
ఇక బాలనటుడి వేషం ఎవరికిద్దామా అని వెతికారు. హిందీలో బాలనటుడుగా పేరు తెచ్చుకున్న డైసీ ఇరానీకి యిద్దామనుకున్నారు. ఇంతలో మెయ్యప్పన్ భార్య వైద్యురాలు డా. సారా రామచంద్రన్ ‘పరమకుడిలో ఒక లాయరు కుటుంబం ఉంది. వాళ్లకు ఆరేళ్ల కొడుకున్నాడు. బాగుంటాడు.’ అని రికమెండు చేసింది. ఆ అబ్బాయిని మెయ్యప్పన్ దగ్గరకు తీసుకుని వచ్చేసరికి, ఆయన సోఫాలో కూర్చుని చదువుకుంటున్నాడు. ఇతన్ని కాస్సేపు పరీక్షించి చూసి, అతని రియాక్షన్ గమనించడానికి టేబుల్ లైట్ ఎత్తి పట్టుకుని ఆ కాంతిలో పరిశీలించాడు, లైటు పడినా కళ్లార్పకుండా కమల్ నిలబడడంతో తృప్తి పడ్డాడు. ఆ విధంగా కమలహాసన్‌ను మెయ్యప్పన్ లిటరల్‌గా లైమ్‌లైట్‌లోకి తీసుకుని వచ్చాడు. కమలహాసన్ చాలా చురుగ్గా ఉండి, అన్నీ టకటకా నేర్చేసుకో సాగాడు. సినిమాలో అతని పాత్రకూ మంచి ప్రాధాన్యత ఉంది.
హీరోగా వేసిన జెమినీకి అప్పట్లో మార్కెట్ హైలో ఉంది. ఈ కుర్రాడికి యింత రోల్ ఏమిటని అతనికి చికాగ్గా ఉండేది. పైగా సినిమా కూడా హీరోయిన్ పేరు మీదుగా పెట్టారు. షూటింగు జరిగే రోజుల్లో ‘కళత్తూరు కణ్ణమ్మ – అదేం పేరు? మీ తర్వాతి సినిమా సుళత్తూరు సుకుమారియా?’ అని గేలి చేసేవాడు. సినిమా పూర్తయి హిట్ అయిందని తెలియగానే చెట్టియార్ దగ్గరకు వచ్చి నాకు 15 వేల రూ.లు ఎక్‌స్ట్రా పేమెంటు యిమ్మనమని అడిగాడు. చెట్టియార్ సరేనని యిచ్చాడు కానీ యితని పద్ధతి నచ్చలేదు. సినిమా 100 రోజులు ఆడింది. ఆ ఫంక్షన్ మద్రాసులో మూడు థియేటర్లలో ప్లాన్ చేశారు. షో మధ్యలో భార్యాభర్తలైన జెమినీ, సావిత్రిలను స్టేజి మీదకు తీసుకుని వచ్చి పరిచయం చేశారు. చప్పట్లు పడ్డాయి.
తర్వాత కమలహాసన్‌ను పరిచయం చేయడానికై అతన్ని చింపిరి బట్టల్లోనే తీసుకుని వస్తూ నేపథ్యంలో ‘అమ్మావుమ్ నీయే..’ పాట వేశారు. ఇక జనం పిచ్చెక్కిపోయారు. చప్పట్ల వర్షం. ఇదంతా చూసి జెమినీకి ఒళ్లు మండిపోయింది. రెండో థియేటరులోనూ అదే సీను రిపీట్ అయ్యేసరికి విపరీతంగా కోపం వచ్చింది. మూడో థియేటర్ చేరేసరికి జెమినీ, సావిత్రి రావల్సిన కారు రాలేదు. కమలహాసన్ ఒక్కడితోనూ ప్రేక్షకులు తృప్తి పడ్డారు. అవేళ రాత్రి నిర్మాతలు జెమినీకి ఫోన్ చేసి, రాలేదేం? రేపు మధురైలో ఫంక్షన్‌కి వస్తున్నారు కదా అంటే జెమినీ విరుచుకుని పడ్డాడు. ‘ఆ కుర్రవెధవకి అంత ఎలివేషనేమిటి? ఆ డ్రస్సేమిటి? ఆ పాటేమిటి? వాణ్ని విడిగా తీసుకుని వచ్చి చూపించడమేమిటి? మేం ఛస్తే రాము. వాణ్నే మధురైకి తీసుకుపొండి.’ అని అరిచాడు.
ఆ సినిమాకు జాతీయ స్థాయిలో బహుమతి వచ్చింది. కమలహాసన్‌కు ప్రెసిడెంటు గోల్డ్ మెడల్ యిచ్చారు. అతని స్టార్‌డమ్ అలా ప్రారంభమైంది. అతను యువకుడిగా తయారయ్యేటప్పటికి బాలచందర్ చేతిలో పడి, ఎంతో ఎదిగిపోయాడు. బాలచందర్ దర్శకత్వంలో ‘‘మన్మథలీల’’ డబ్బింగ్ తెలుగునాట విపరీతంగా ఆడేసింది. వెంటనే అతను అంతకు ముందు నటించిన చిన్నా, చితకా తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ అయి వచ్చేశాయి. జెమినీ గణేశన్ నిర్మించి, బాలచందర్ దర్శకత్వంలో నటించిన సినిమా ‘‘నాన్ అవన్ ఇల్లయ్’’ (1974 – మరాఠీలో వచ్చిన యీ సినిమాను హిందీలో ‘‘ఓ మై నహీఁ’’గా తీశారు) దానిలో జెమినీ అనేక అమ్మాయిలతో ప్రేమాయణం నడుపుతాడు. వారిలో ఒకమ్మాయి తమ్ముడిగా కమలహాసన్ గెస్ట్ రోల్ వేశాడు. దాన్నీ తెలుగులోకి డబ్ చేసి, తెలుగు పోస్టర్ల మీద కమలహాసన్ బొమ్మ పెద్దదిగా వేసి, జెమినీ బొమ్మ చిన్నదిగా వేశారు! జెమినీ చూసి ఉంటే ఎంత ఉడుక్కునేవాడో!
ఇక యీ ‘‘కళత్తూరు కణ్ణమ్మ’’ను తెలుగులో ‘‘మా ఊరి అమ్మాయి’’గా డబ్ చేసి రిలీజ్ చేస్తే అదీ బాగా ఆడింది. హిందీలో ‘‘మై చుప్ రహూంగీ’’ (1962) పేరుతో భీమ్‌సింగ్ దర్శకత్వంలో మీనాకుమారి, సునీల్ దత్‌లతో తీస్తే అదీ బాగా ఆడింది. దానిలో ‘అమ్మావుమ్ నీయే..’ పాటను ‘తుమ్హీహో మాతా..’గా తీశారు. అదీ సూపర్ హిట్. తర్వాతి రోజుల్లో ఎవిఎం వారు నాగేశ్వరరావు డేట్స్ చేతిలో ఉండి, సబ్జక్ట్ ఏదీ కుదరకపోతే దీన్నే ‘‘మూగనోము’’ (1969) పేరుతో నాగేశ్వరరావు, జమున, రంగారావులతో తీస్తే డి యోగానంద్ డైరక్షన్‌లో తీస్తే అదీ బాగా ఆడింది. కమల్ పాత్రను మాస్టర్ బ్రహ్మాజీ వేసి ‘‘తల్లివి నీవే, తండ్రివి నీవే.’ పాట పాడాడు. ఇక జెమినీ మాటకొస్తే అతనూ బాలచందర్‌కు అభిమాన నటుడు కాబట్టి, తన ‘‘ఉన్నాల్ ముడియుం తంబి’’- ‘‘రుద్రవీణ’’లలో యిద్దర్నీ నటింప చేశాడు. కమలహాసన్ నిర్మాత అయ్యాక జెమినీకి తన ‘‘అవ్వయ్ షణ్ముగి’’ (1996) (‘‘భామనే సత్యభామనే’’)లో మంచి వేషం యిచ్చాడు. (ఫోటో – కళత్తూరు కణ్ణమ్మ, ఆ సినిమాలో కమల్, క్రింద అవ్వయ్ షణ్ముగి, ప్రక్కన మూగనోము)
– ఎమ్బీయస్ ప్రసాద్
ఆరేళ్ళ వయసున్న కమలహాసన్ ని చూసి కుళ్ళుకున్న జెమినీ సావిత్రిని చూసి కుళ్ళుకున్నట్లు మహానటి సినిమాలో చూపిస్తే ప్రసాద్ గారికి ఎందుకోగానీ నచ్చలేదు. కాగా 1979లో అల్లాఉద్దీన్ అద్భుతదీపం అనే సినిమా వచ్చింది. అందులో కమలహాసన్ హీరోగా, రజనీకాంత్ నెగటివ్ టచ్ ఉన్న సెకండ్ హీరోగా వేస్తే జెమినిగణేశన్ ఒక దుష్టవజీర్ గా విలన్ పాత్ర వేశాడు. కానీ ఎందుకో కానీ ఆ పాత్రని క్లైమాక్స్ లో మెయిన్ హీరో కమల్ కాకుండా రజనీ చంపేస్తాడు. ఈ చిత్రంలో కూడా సావిత్రి కమల్ తల్లిగా నటించింది. కానీ ఆమెకీ, జెమినీకి మధ్యలో ఒక్క సీన్ కూడా ఉండదు.
prasad garu yemi?
eedu garu aipoyada?
paytm-pedigree-tinetodu
ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు >>> మేల్ ఎస్కార్ట్
roja ramani child artist ga vunnappudu yemindo oka snippet vaduldu
మరో గు రూ జీ ఉన్నారు.. తాను జవాబు ఇవ్వలేని ప్రశ్నలు వేసిన పాఠక మహశయుడి పై అసూయ పడి ఆ కా మెం ట్ డె లీ ట్ చేయించేస్తారు.. అంత ఐ న్ టో ల రె న్స్ వారికి
EMBS ni psychiatrist ki choopinclisinde
chadastam baga mudirindi
inkenni rojulu bathukutav ra babu
hi, can you ask the web team to put this under MBS or tag as MBS, so that they are easy to find