అల్లు అర్జున్ తో త్రివిక్రమ్, ఓ మైథలాజికల్ సినిమా చేయబోతున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా మైథలాజికల్ సినిమా అనగానే ఎవరైనా రామాయణం లేదా భారతం వైపు చూస్తారు.
కానీ బన్నీతో చేయబోయే మైథలాజికల్ సినిమా సరికొత్తగా ఉంటుందంటున్నాడు నిర్మాత నాగవంశీ. ఓ దేవుడి చరిత్ర ఆధారంగా, పూర్తిస్థాయి పురాణగాధను తెరకెక్కించబోతున్నామని, అందులో ఎలాంటి ఫిక్షన్ కూడా జోడించడం లేదని స్పష్టం చేశాడు.
“అల్లు అర్జున్ తో పురాణాల నేపథ్యంలో పూర్తిస్థాయి మైథలాజికల్ సినిమా చేయబోతున్నాం. మేం ఎత్తుకున్న సబ్జెక్ట్ చూసి ఇండియా మొత్తం ఆశ్చర్యపోతుంది. రామాయణం, మహాభారతం నేపథ్యంలో వచ్చే సినిమా కాదిది. పురాణాల్లోనే ఎవ్వరికీ తెలియని దేవుని పాత్రతో సినిమా తీయబోతున్నాం. అలా అని ఇది ఫిక్షన్ కూడా కాదు. మన పురాణాల్లో ఉన్న పాత్రలే. ఆ దేవుడి గురించి చాలామందికి తెలిసిందే. కాకపోతే ఆ దేవుడి చరిత్ర చాలామందికి తెలియదు. అది మేం చెప్పబోతున్నాం.”
ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా పనిమీదే బిజీగా ఉన్నారని, ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనే విషయాన్ని అప్పుడే చెప్పలేమంటున్నాడు నాగవంశీ.
అట్లీ దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పాడు బన్నీ. పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ నుంచి రాబోయే సినిమా ఇదే. బన్నీ పుట్టినరోజు సందర్బంగా వచ్చేనెల 8న ఈ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేయబోతున్నారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.
అట్లీ దర్శకత్వంలో సినిమా కొంత భాగం షూట్ పూర్తయిన తర్వాత, త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేస్తాడు బన్నీ. ఇలా చేయడానికి కూడా ఓ కారణం ఉంది. త్రివిక్రమ్ సినిమా మేకింగ్ కు ఎలాంటి డెడ్ లైన్స్ పెట్టుకోవడం లేదు. చాలా టైమ్ పడుతుంది. అందుకే అట్లీ మూవీ మొదలైన కొన్నాళ్లకు త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేస్తాడు బన్నీ.
Jambavantudi story ayyundochu… adi ayite Bunny ki makeup avasaram ledu…
Allu arjun real mega star