వైసీపీ ప్రయోగిస్తున్న పదునైన ఆస్త్రం

టీడీపీ కూటమి ప్రభుత్వం బలహీన వర్గాలకు చెందిన మహిళ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని బొత్స అన్నారు.

బీసీ మహిళ మేయర్ పీఠంపై ఉంటే సహించలేకపోతున్నారని సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. విశాఖ మేయర్‌గా ఉన్న వైసీపీ మహిళా నేత బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు అని అన్నారు. ఆమె సమర్థంగా నాలుగేళ్ల పాటు పనిచేశారని గుర్తు చేశారు. ఆమెను మేయర్ పీఠం నుంచి దించేయాలనుకోవడం బాధాకరం అని ఆయన అన్నారు. బీసీ ఆడబిడ్డ ఉన్నత పదవిలో ఉండడం వారికి బహుశా ఇష్టం లేకపోవచ్చు అని బొత్స కామెంట్స్ చేశారు.

టీడీపీ కూటమి ప్రభుత్వం బలహీన వర్గాలకు చెందిన మహిళ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని బొత్స అన్నారు. వైసీపీ మేయర్‌పై అవిశ్వాసం తరువాత రెండు వైపులా రాజకీయం ఎత్తులు పై ఎత్తులతో సాగుతోంది.

ఇప్పుడు బీసీ మహిళ సెంటిమెంట్‌ను వైసీపీ ప్రయోగిస్తోంది. యాదవ సామాజిక వర్గం నేతలు తమ వర్గానికి చెందిన మహిళను మేయర్ నుంచి దించేయవద్దు అని కూటమికి ఇప్పటికే విన్నపం చేశారు. మహిళా మేయర్ రెండు దశాబ్దాల తర్వాత విశాఖకు వస్తే ఆమెను ఐదేళ్లు కొనసాగించకపోవడమేంటి? అని వారు అంటున్నారు.

ఈ సెంటిమెంట్లను ఇప్పుడు వైసీపీ అస్త్రాలుగా మలచుకుంటోంది. తాము బీసీ మహిళలకు అన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చామని, కానీ కూటమి పెద్దలు అధికారం, రాజకీయం చూసుకుంటున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. రేపటి రోజున వైసీపీ మేయర్ గద్దె దిగినా, కూటమి మీద ఆయుధంగా ఈ విమర్శలనే ఎక్కుపెట్టడానికి వైసీపీ సిద్ధపడుతోంది అని అంటున్నారు.

కూటమికి ఒక విధంగా ఇరకాటమే. “బీసీ మహిళను దించేశారు” అన్న అపఖ్యాతి వస్తుందన్నది తెలిసినా, అధికారం కోసం తప్పదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన వారు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్‌గా ఉండి, మరీ తమ వారిని దించేయడమేంటని యాదవ సామాజిక వర్గ నేతలు గుర్రు మంటున్నారు.

14 Replies to “వైసీపీ ప్రయోగిస్తున్న పదునైన ఆస్త్రం”

  1. బాణం పోయింది, అస్త్రం వచ్చిందా కొత్తగా, ఇది కూడా వెనక నుంచి దిగకుండా చూసుకోండి.

    1. 2024 ఎన్నికల్లో 11 గజాల లోతుకు దిగింది ఆల్రెడీ.. ఆ బండ శరీరాలకు, సిగ్గులేని జన్మలకు అర్థమై చావడం లేదు .. అంతే..

  2. మేయర్ స్థాయి వ్యక్తులు ఏమైనా బలహీనులా? ఇంకా బీసీ కార్డు, మహిళా కార్డు వాడటానికి. ఇదంతా రాజకీయాలు అంతే

  3. నా బీసీలు , నా ఎస్సిలు , నా ఎస్టీలు అంటేనే జగన్ ని జనం పట్టించుకోలేదు .. తొక్కలో మేయర్ సీట్ గురుంచి పట్టించుకుంటరా ..

  4. మహిళలని గౌరవించడంలో వైసీపీ ఎప్పుడూ ముందు ఉంటుంది. సాక్షాత్తూ ఒక మహిళని ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర వారిది. కూటమి పార్టీలన్నీ కలిసినా వైసీపీకి సాటిరాలేరు.

  5. “……….పదునైన అస్త్రం” అని చదివి వామ్మొ ……అనుకొన్నా ఏమిటి GA ఈ రాతలు……చంద్రబాబు లోకేష్ లు కూర్చోరుకదా ఆ సీట్ లో …….ఆమాత్రం బర్రలెదా tdp కి………ఏమిటో GA నివు నీ రాతలు…..

Comments are closed.