రాబిన్ హుడ్ కెరీర్ బెస్ట్ మూవీ

టాలెంట్ ఉండడం వేరు. టాలెంట్ ఉందని ఊహించుకోవడం వేరు.

హీరో నితిన్ హైలి యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ రాబిన్ హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకీ కుడుముల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.

“భీష్మ” సినిమా తర్వాత మెగాస్టార్ కోసం ఒక కథ అనుకున్నాను. ఆయనకు ఫస్ట్ ఐడియా చెప్పితే చాలా ఎక్సైట్ అయ్యారు. స్టోరీ, స్క్రీన్‌ప్లే డెవలప్‌మెంట్‌కి చాలా సమయం తీసుకుని చేశాను, అయితే ఆయనను సంతృప్తిపరచలేకపోయాను. మేము అనుకున్నలాగా అది అవ్వలేదు. మరో కథతో వస్తానని చెప్పాను. తర్వాత మైత్రి మూవీ మేకర్స్ అధినేతలకు “రాబిన్ హుడ్” ఐడియా చెప్పడం, వారి అంగీకారం లభించడం జరిగింది. “భీష్మ” సినిమాతో నితిన్‌తో కంఫర్టబుల్ జర్నీ వచ్చింది. “రాబిన్ హుడ్” జర్నీ కూడా వండర్ఫుల్‌గా జరిగింది.

“రాబిన్ హుడ్”లో హీరో మానిప్యులేటర్. ఫిజికల్ స్ట్రెంత్ కంటే మెంటల్ స్ట్రెంత్ స్ట్రాంగ్ అని నమ్మే వ్యక్తి. సినిమాలో ఫస్ట్ 20 నిమిషాలు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం రకరకాల గెటప్స్ అలరిస్తాయి. 20 నిమిషాల తర్వాత కథ పూర్తిగా మారిపోతుంది. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమా నితిన్ కెరీర్‌లోనూ, నా కెరీర్‌లోనూ బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది. సినిమా మొత్తం రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో ఫన్ ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ ఎంటర్టైనర్ ఇది.

ఒక క్యామియో రోల్ ఇంటర్నేషనల్ స్టార్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. వార్నర్‌ని ఢిల్లీలో కలిసి ప్రెజెంటేషన్ ఇచ్చాను. ఆయన కూడా చాలా ఎక్సైట్ అయ్యారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌ది చాలా ఇంపార్టెంట్ రోల్. ఆయన సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతుంటారు. హీరో ఆయన్ని మానిప్యులేట్ చేసి ఓ సీరియస్ వరల్డ్‌లోకి తీసుకెళ్తాడు. ఆయన అమాయకంగా అందులో ఇరుక్కుపోతాడు. ఈ క్యారెక్టర్ రాసినప్పటి నుంచి ఆయననే ఊహించుకున్నాను.

టాలెంట్ ఉండడం వేరు. టాలెంట్ ఉందని ఊహించుకోవడం వేరు. ఇందులో శ్రీలీల క్యారెక్టర్ రెండో టైపు (నవ్వుతూ). తనను చాలా ఇంటెలెక్చువల్ అనుకునే అమ్మాయి. చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ క్యారెక్టర్‌లో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.

జీవి ప్రకాష్ కుమార్‌తో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉంది. ఆయన కరెక్ట్ టైమ్‌కు మ్యూజిక్ డెలివరీ చేసే కంపోజర్. ఇప్పటికే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బీజీఎం కూడా ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. “అదీ డా” సర్‌ప్రైజ్ పాట కూడా కథలో భాగంగానే వస్తుంది.

One Reply to “రాబిన్ హుడ్ కెరీర్ బెస్ట్ మూవీ”

Comments are closed.