ఎవరితోనూ పోల్చొద్దంటున్న సన్నీలియోన్

‘పెద్దలకు మాత్రమే’ అనే సినిమాల స్థాయి దాటేసి, బూతు సినిమాల్లో నటించిన సన్నీలియోన్, బాలీవుడ్ తెరపైనా ఓ వెలుగు వెలిగేస్తోంది. సన్నీలియోన్‌కి ఇప్పుడు బాలీవుడ్‌లో వున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. సన్నీలియోన్ ఓకే…

‘పెద్దలకు మాత్రమే’ అనే సినిమాల స్థాయి దాటేసి, బూతు సినిమాల్లో నటించిన సన్నీలియోన్, బాలీవుడ్ తెరపైనా ఓ వెలుగు వెలిగేస్తోంది. సన్నీలియోన్‌కి ఇప్పుడు బాలీవుడ్‌లో వున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. సన్నీలియోన్ ఓకే అంటే చాలు, సినిమాలు తెరెకక్కించడానికి డజను మంది నిర్మాతలు సిద్ధంగా వున్నారట. 

అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చుకుని సన్నీలియోన్‌తో సినిమాలు చేయడం తప్ప, అంతెందుకు.? ఇది చాలు.! అనే ఛాన్స్ నిర్మాతలకి ఇవ్వడంలేదామె. సన్నీలియోన్‌కి వున్న డిమాండ్ అలాంటిది. ఒకప్పుడు మలయాళంలో షకీలాకి కూడా ఇలాంటి డిమాండే వుండేది.. అని ఎవరో సన్నీలియోన్ చెవిలో గుసగుసలాడారట. 

దాంతో, సన్నీలియోన్‌కి ఒళ్ళు మండింది. ‘నాకెవరితోనూ పోటీ లేదు..’ అనేసింది సన్నీలియోన్. ‘నా రూట్‌లో నేను సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా.. ఈ కెరీర్ ఎన్నాళ్ళు ఇలా వుంటుందో నేను చెప్పలేను. అవకాశాలు వస్తున్నాయి, ఒప్పుకుంటున్నాను.. నా డిమాండ్‌కి తగ్గ రెమ్యునరేషన్ ఇస్తున్నారు.. నన్నెవరితోనూ దయచేసి పోల్చొద్దు ప్లీజ్..’ అంటూ సన్నీలియోన్ క్లారిటీ ఇచ్చింది.