వ్యవహారాలు చక్కబెడుతున్న నాగ్

రాష్ట్ర విభజనకు ముందు ప్రతి ఒక్కరు టాలీవుడ్ పరిస్థితిపైనే ఆలోచించారు. సినిమా పరిశ్రమ వుంటుదా? లేక ఆంధ్రకు తరలిపోతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇంత ఇన్ ఫ్రాస్టక్చర్, ఇన్ని వ్యవహారాలు మళ్లీ ఇంకో…

రాష్ట్ర విభజనకు ముందు ప్రతి ఒక్కరు టాలీవుడ్ పరిస్థితిపైనే ఆలోచించారు. సినిమా పరిశ్రమ వుంటుదా? లేక ఆంధ్రకు తరలిపోతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇంత ఇన్ ఫ్రాస్టక్చర్, ఇన్ని వ్యవహారాలు మళ్లీ ఇంకో దగ్గర నెలకొల్పడం అంత ఈజీ కాదు అన్న ఆలోచనలు కూడా జనాల్లో కలిగాయి. ఇంతలో కెసిఆర్ ప్రభుత్వం కొలువు తీరిన తరువాత, ఆయన ఫిల్మ్ సిటీని 2000 ఎకరాల్లో నిర్మిస్తామనేసరికి టాలీవుడ్ తరలింపు తప్పదేమో అనుకున్నారు. 

కానీ ఇంతలో హీరో కృష్ణ, మంచు మోహన్ బాబు ఫ్యామిలీ, రామోజీరావు తదితరులు కెసిఆర్ కు దగ్గరకావడం ఫిల్మ్ సిటీ వ్యవహారం కాస్త వెనక పడడంతో టాలీవుడ్ ఇక్కడే వుంటుదని ధృవపడింది. మరోపక్క టాలీవుడ్ లో సన్నిహిత సంబందాలున్న, తెలుగుదేశం పార్టీకి చెందిన తలసాని శ్రీనివాస యాదవ్ తెరాసలోకి చేరి మంత్రి కావడం కూడా టాలీవుడ్ కు భరోసా ఇచ్చింది.

కానీ ఇప్పుడు పరిస్ఝితులు మారుతున్నాయి. తెరవెనుక చాలా సమీకరణలు మొదలయ్యాయి. టాలీవుడ్ పార్ట్ 2 ను ఆంధ్రలో ఏర్పాటు చేయాలన్న ఆలోనలు మొగ్గతొడుగుతున్నాయి. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రాగంతో కొందరు టాలీవుడ్ ప్రముఖలు ఈ మేరకు తెరవెనుక సమాలోచనలు కూడా ప్రారంభించారు.

ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ లోని ప్రముఖ స్టూడియో అధిపతి అయిన నాగార్జున కూడా హైదరాబాద్లోని తన వ్యవహారాలను చాలా వరకు చక్కబెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగార్జునకు చాలా రకాల వ్యాపారాలున్నాయి. స్టూడియో, చానెల్, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్, అన్నింటికి మించి రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలు వున్నాయి. 

వీటిలో చానెల్ వ్యవహారం సెటిల్ అయిపోయింది. స్టార్ కు అమ్మేసారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బంధాలు కూడా సెటిల్ చేసినట్లు టాలీవుడ్ లోని ఇన్నర్ సర్కిళ్లలో వినిపిస్తున్నాయి. నాగార్జునతో బంధుత్వం వున్న సురేష్ ఇప్పుడు ఆంధ్రలో టాలీవుడ్ ను ఏర్పాటు చేసే వ్యవహారంలో కీలకంగా వున్నారని వినికిడి. అలాగే పవన్ ద్వారా చంద్రబాబుకు దగ్గరైనా పివిపి కూడా నాగార్జునకు ఇప్పుడు సన్నిహితుడు. 

కానీ నేరుగా నాగార్జునకు బాలయ్య, చంద్రబాబుతో అంత బలమైన బంధాలు లేవు. కానీ ఫరవాలేదనే బంధాలు వున్నాయి. మరి వీటి నేపథ్యంలో ఆంధ్రకు వెల్లాలనుకుంటున్నారో, లేదా ఇంక ఇన్ని వ్యాపారాలు పిల్లలు నిర్వహించలేరు అన్న నిర్ణయానికి వచ్చి, కేవలం సినిమాలు, స్టూడియో పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నారో కానీ, మొత్తానికి ఆయన తన వ్యవహారాలు అన్నీ ఓ కొలిక్కి తెచ్చుకునే పనిలో వున్నారని మాత్రం టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో వినిపిస్తోంది. 

నాగ్ కుమారులు చైతన్య, అఖిల్ హీరోలుగా తయాయ్యే పనిలో వున్నారు. చైతన్యసినిమా నిర్మాణంలో కూడా తర్ఫీదు పొందుతున్నారు. అందువల్ల వారు నాగ్ మాదిరిగా ఇన్ని రకాల వ్యాపారాలు చేయలేకపోవచ్చు. పైగా ఇక్కడ ప్రభుత్వ వ్యవహారాలు ఎలా వుంటాయో కూడా తెలియదు. అందుకే నాగ్ ముందు జాగ్రత్తగా చాలా పనులు ఓ కొలిక్కి తెచ్చేసి, కేవలం స్టూడియో, సినిమాలు, టీవీ సీరియళ్లపైనే దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.