చిరంజీవి వచ్చె..మొదలాడు

రామ్ చరణ్ -దానయ్య-శ్రీనువైట్లు కాంబినేషన్ సినిమా చకచకా రెడీ అయిపోతోంది. దసరాకు విడుదల పక్కా..ఇది నిన్నటి మాట. ఇప్పుడు దీనికి వున్నట్లుండి బ్రేక్ పడిందన్నది తాజా బజ్. చిరంజీవి 150వ సినిమా లేకపోవడంతో, ఇప్పుడు…

రామ్ చరణ్ -దానయ్య-శ్రీనువైట్లు కాంబినేషన్ సినిమా చకచకా రెడీ అయిపోతోంది. దసరాకు విడుదల పక్కా..ఇది నిన్నటి మాట. ఇప్పుడు దీనికి వున్నట్లుండి బ్రేక్ పడిందన్నది తాజా బజ్. చిరంజీవి 150వ సినిమా లేకపోవడంతో, ఇప్పుడు చరణ్ సినిమాపైనే ఆయన దృష్టి పడింది.

అందులో ముందుగా చిన్న కామెయో క్యారెక్టర్ అనుకున్నారు. కాదు చిన్నఫైట్ వుండాలని జోడించారు. తరువాత అయిటమ్ సాంగ్ వుంటే..అమితాబ్..అభిషేక్..మధ్యన ఐశ్వర్య మాదిరిగా, చిరు-చరణ్ మధ్యన ఇలియానా అన్న ప్లాన్ వేసారు.

దీంతో స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు అవసరం అయ్యాయని వినికిడి. అది కూడా సెకండాఫ్ లోనే. అందుకే ఇప్పుడు సెకండాఫ్ స్క్రిప్ట్ కు చిన్న మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.