దేవీకి చార్మీఅంటే ప్రత్యేక ఇంట్రస్ట్ వుందని చాన్నాళ్ల క్రితం వార్తలు గుప్పుమన్నాయి. వాళ్లు కూడా చెట్టాపట్టాలేసుకునే వుండేవారని కూడా వదంతులు వినిపించాయి. అయితే ఇటీవల అవన్నీ సద్దుమణిగాయి. కానీ వున్నట్లుండి ఇప్పుడు దేవీ మళ్లీ ఈ వ్యవహారానికి జీవం పోసినట్లు కనిపిస్తోంది.
Advertisement
జ్యోతిలక్ష్మీ టీమ్ రాకింగ్..మీరు చించి ఆరేస్తున్నారు అన్నట్లుగా, పూరి, చార్మిలను ఉద్దేశించి ట్వీట్ చేసాడు దేవీ. సినిమా షూటింగ్ దశలో వుంది. ఇప్పడేమీ అడియోనూ లేదు..విడుదలా లేదు. కానీ మరి ఉన్నట్లుండి దేవీకి ఇలా ఎందుకు ట్వీట్ చేయాలనిపించిందో మరి?