మహేష్ బాబు బ్రహ్మోత్సవం మొదలెట్టేసాడు. నిజానికి శ్రీమంతుడు తరువాత తమ సినిమా మహేష్ తో చేయాలని పూరి అనుకున్నాడని వార్తలు వినవచ్చాయి. జ్యోతిలక్ష్మి లాంటి చిన్న సినిమా ప్రారంభించినపుడు టైమ్ గ్యాప్ కోసం అని కూడా అనుకున్నారు. కానీ చిరంజీవి సినిమా వుంటుదని తెలిసాక, మహేష్-పూరి కాంబినేషన వుండదని ఫిక్సయ్యారు.
సరే, సత్యమూర్తి తరువాత ఆ బ్యానర్ లో మహేష్ సినిమా వుంటుందని, త్రివిక్రమ్ డైరక్టర్ అని అనుకున్నారు. కానీ సత్యమూర్తి కి మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చాక, త్రివిక్రమ్ టైమ్ తీసుకుంటాడని వార్తలు వినవచ్చాయి. ఇప్పుడు మహేష్ కొత్త సినిమా మొదలెట్టేస్తున్నాడు. అంటే మరో ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు మహేష్ ఖాళీగా వుండడు.
అంటే అంతవరకు త్రివిక్రమ్ ఆగుతాడా? లేక మరెవరితోనైనా ట్రయ్ చేస్తాడా? ఎవరున్నారు? పవన్..బన్నీ..చరణ్ వీళ్లంతా వేరే వేరే బిజీగా వున్నారు. ఈ గ్యాప్ లో సరదాగా తన స్టయిల్ లో ఎటువంటి సంకెళ్లు లేకుండా చిన్న సినిమా తీయచ్చుగా..తన అభిమానుల కోసం. లేదంటే ఖాళీగా వుండాల్సిందే.