షాక్ ఇచ్చిన దోచేయ్

అటు హీరో నాగ చైతన్య కానీ, ఇటు దర్శకుడు సుధీర్ వర్మ కానీ, అస్సలు ఎనలైజ్ చేయలేకపోతున్నంతటి పరాజయం దోచేయ్. మరీ ఇంత హీనమైన కలెక్షన్లు వస్తాయని ఎవరూ అనుకోలేదు. సినిమాకు పెద్దగా నెగిటివ్…

అటు హీరో నాగ చైతన్య కానీ, ఇటు దర్శకుడు సుధీర్ వర్మ కానీ, అస్సలు ఎనలైజ్ చేయలేకపోతున్నంతటి పరాజయం దోచేయ్. మరీ ఇంత హీనమైన కలెక్షన్లు వస్తాయని ఎవరూ అనుకోలేదు. సినిమాకు పెద్దగా నెగిటివ్ సమీక్షలు లేవు. రేటింగ్ లు కూడా ఫరవాలేదనుకునే రేంజ్ లోనే వున్నాయి,. కానీ కలెక్షన్లు మాత్రం లేవు. నాగ చైతన్య డిజాస్టర్లు దడ, బెజవాడ కన్నా దోచేయ్ కలెక్షన్లు తక్కవే. 

ఎందుకిలా అన్నది బుర్రలు బద్దలు కొట్టుకున్నా అర్థం కావడంలేదట. ఇది సినిమా వైఫల్యమా లేక, నాగ చైతన్య మార్కెట్ పడిపోతోందా? అన్నది అర్థం కావడం లేదు. నాగచైతన్య మార్కెట్ పడిపోతోంది అనుకుందామంటే, ఒక లైలా కోసం బాగానే వసూళ్లు సాగించింది. పోనీ సినిమా వైఫల్యం అనుకుందామనుకుంటే, మరీ తీసికట్టేమీ కాదు. కానీ మరి జనం ఎందుకు రావడం లేదు? దర్శకుడు పూర్తిగా ఎ సెంటర్లను దృష్టిలో పెట్టుకుని సినిమా తీయడమే ఈ వైఫల్యానికి కారణం అంటున్నారు. 

బి సిలకు సినిమా దూరమైంది. ఎ సెంటర్ల జనాలకు సినిమా నచ్చలేదు. దాంతో సినిమా కాస్తా రెంటికి చెడిన రేవడి అయింది. నాగ చైతన్య బాగానే వుంటాడు..మరో సినిమా ఎలాగూ వస్తుంది. సుధీర్ వర్మ పెద్ద సినిమా కాకుంటే మళ్లీ నిఖిల్ తో చిన్న సినిమా అయినా చేసుకుంటాడు. ఆయనా ఓకె. కానీ ఎటొచ్చీ పాపం..కనీసం అయిదు కోట్లకు పైగానే లాస్ అంటున్నారు నిర్మాత భోగవిల్లి ప్రసాద్ కు. 

ఇక్కడ కనెక్షన్ కాదు కానీ, అదేంటో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్తే చాలు ఆ నిర్మాతను వెదుక్కుంటూ కష్టాలు వచ్చేస్తాయంటున్నారు టాలీవుడ్ లో గ్యాసిప్ రాయుళ్లు. టెంపర్ తో బండ్ల గణేష్ పడ్డ సమస్యలు ఇన్నీ అన్నీ కావు. ఇప్పుడు సుకుమార్ తో కలిసి ఎన్టీఆర్ చేయబోయేది ఈ ప్రసాద్ గారి సినిమానే.