దిల్ రాజు రుద్రమదేవికి దారిస్తాడా?

వాయిదాల పద్దతిలో ముందుకు వెళ్తోంది రుద్రమదేవి. ఇప్పుడు లేటెస్ట్ మజిలీ సెప్టెంబర్ 18 లేదా 24 అంటున్నారు. సెప్టెంబర్ 24 వైపే నిర్మాత గుణశేఖర్ మొగ్గుచూపుతున్నారని వినికిడి. కానీ ఇక్కడ ఓ సమస్య వుంది.…

వాయిదాల పద్దతిలో ముందుకు వెళ్తోంది రుద్రమదేవి. ఇప్పుడు లేటెస్ట్ మజిలీ సెప్టెంబర్ 18 లేదా 24 అంటున్నారు. సెప్టెంబర్ 24 వైపే నిర్మాత గుణశేఖర్ మొగ్గుచూపుతున్నారని వినికిడి. కానీ ఇక్కడ ఓ సమస్య వుంది.

అదే రోజు దిల్ రాజు నిర్మించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా విడుదల వుంది. సాయిధరమ్ తేజ హీరో, హరీష్ శంకర్ దర్శకుడు. అదే దిల్ రాజు రుద్రమదేవికి నైజాం డిస్ట్రిబ్యూటర్. మరి తన సినిమా మీద తన సినిమాను పోటీకి దింపుతాడా? కష్టం.

అందువల్ల రుద్రమదేవికి 24వ తేదీ దొరకడం కష్టం కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ముందే డేట్ ఇచ్చారు కాబట్టి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వెనక్కు వెళ్లదు. అంటే ఇక రుద్రమదేవే ముందుకు రావడమో, వెనక్కు వెళ్లడమో చేయాల్స వుంటుంది.