‘మంచు’ మంచివాడైపోయాడట

మంచు ఫ్యామిలీ నటులకు అన్ని కళల్లోనూ ప్రవేశమే. ఫైట్లు, డ్యాన్స్ డైరక్షన్, స్క్రీన్ ప్లే, కథ, మాటలు ఇలా చాలా వ్యవహారాలున్నాయి విష్ణు అయినా మనోజ్ అయినా. వాళ్ల వాళ్ల సినిమాల్లో వీరి జోక్యం…

మంచు ఫ్యామిలీ నటులకు అన్ని కళల్లోనూ ప్రవేశమే. ఫైట్లు, డ్యాన్స్ డైరక్షన్, స్క్రీన్ ప్లే, కథ, మాటలు ఇలా చాలా వ్యవహారాలున్నాయి విష్ణు అయినా మనోజ్ అయినా. వాళ్ల వాళ్ల సినిమాల్లో వీరి జోక్యం కాస్త వుంటుందని వినికిడి.

అయితే ఇప్పుడు తాజా బజ్ ఏమిటంటే, మంచు విష్ణు నటించి, నిర్మిస్తున్న డైనమైట్ సినిమాలో మాత్రం అస్సలు కలుగచేసుకోలేదట. ఈ సినిమాకు తమిళ సినిమా ఆధారం. దాని ప్రకారం తెలుగులో ఎలా వుంటే బాగుంటుందో, అలా తీసి ఇచ్చే బాధ్యతను దర్శకుడు దేవా కట్టా మీదే వదిలేసాడట విష్ణు.

దేవా కట్టా మీద నమ్మకంతోనూ, రీమేక్ తో ఎలాగైనా మంచి సక్సెస్ కొట్టి తీరాలన్న పట్టుదలతోనూ విష్ణు కేవలం తన నటనకే పరిమితం అయిపోయాడని యూనిట్ వర్గాల బోగట్టా. ఈ సినిమా సెప్టెంబర్ 4న విడదులవుతోంది.