పవనన్నాయ్యా..వదినెక్కడ?

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా స్టార్ బర్త్ డే రోజున  రెండు అనుభవాలకు లోనయ్యారు. ఒకటి చిరంజీవి ఇంటికి పవన్ వెళ్లడంతోనే తమ ఇంటికే వచ్చాడన్నంత ఆనందానికి లోనయ్యారు. కానీ పార్క్ హయాత్ లో…

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా స్టార్ బర్త్ డే రోజున  రెండు అనుభవాలకు లోనయ్యారు. ఒకటి చిరంజీవి ఇంటికి పవన్ వెళ్లడంతోనే తమ ఇంటికే వచ్చాడన్నంత ఆనందానికి లోనయ్యారు. కానీ పార్క్ హయాత్ లో మహా మహులంతా సతీ సమేతంగా వస్తే, తమ పవర్ స్టార్ కూడా అలాగే వస్తారనుకున్నారు.

ఇంత వరకు ఎవరికీ కనిపించని పవన్ మూడో భార్యను ఈసందర్భంగా చూడొచ్చనుకున్నారు. పవన్ ను సతీసమేతంగా చూసి ఆనందపడ్డారు. కానీ అందరూ మహా మహులు భార్యలతో వచ్చారు. అతి కొద్దిమంది మాత్రమే సింగిల్ గా వచ్చారు.

వారిలో పవన్, ఆయన సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వున్నారు. దీంతో అభిమానులు నిరాశ పడ్డారు. ఈ విదంగానైనా తమ అభిమాన స్టార్ విదేశీ భార్యను కళ్లారా చూడోచ్చు అనుకున్నారు. కానీ అలా కాలేదు.