బాలయ్య గ్యాంగ్ లీడర్

బాలయ్య పక్కా భోళా మనిషి. సముద్రుడు జనాన్ని చూసే పొంగినట్లు, ఆయన ఫంక్షన్లలో ఉప్పింగిపోతారు. ఆ మధ్య ఓ ఫంక్షన్ లో, మొన్న సంతోషం ఫంక్షన్ లో పాటలు కూడా పాడేసారు. నిన్నటికి నిన్న…

బాలయ్య పక్కా భోళా మనిషి. సముద్రుడు జనాన్ని చూసే పొంగినట్లు, ఆయన ఫంక్షన్లలో ఉప్పింగిపోతారు. ఆ మధ్య ఓ ఫంక్షన్ లో, మొన్న సంతోషం ఫంక్షన్ లో పాటలు కూడా పాడేసారు. నిన్నటికి నిన్న మెగాస్టార్ చిరంజీవి షష్ఠిపూర్తి ఫంక్షన్ లో కూడా బాలయ్య చాలా సందడి చేసినట్లు తెలుస్తోంది.

చిరంజీవి గ్యాంగ్ లీడర్ లోని, జిఎఎన్జీ గ్యాంగ్..గ్యాంగ్ లీడర్  పాటకు చిందేయడమే కాకుండా, జి.ఎ.ఎన్.జి అంటూఆయన కాస్త గట్టిగా ఆలపించారని తెలుస్తోంది. మొన్న సైమా అవార్డుల ఫంక్షన్ లో కూడా బాలయ్య తన స్పీచ్ తో ఆహుతులను ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తిన సంగతి తెలిసిందే.  మొత్తానికి బాలయ్య వుంటే ఎంటర్ టైన్ మెంటే.