మ్యాన్యువల్ వర్క్ ను ఏదో విధంగా స్పీడప్ చేయచ్చు..కానీ కంప్యూటర్ వర్క్ కు ఇవ్వాల్సిన టైమ్ ఇవ్వాల్సిందే. అది మరిచిపోయి, తేదీలు ప్రకటించుకుంటూ పోతే, చాలా ఇబ్బంది అవుతుంది. అనుకున్న తేదీకి సినిమా రెడీ కాక, డేట్లు మార్చుకుంటూ పోతే రెప్యుటేషన్ దెబ్బతింటింది.
పబ్లిసిటీ ప్రతిసారి మళ్లీ మొదటికి వస్తూ వుంటుంది. ఇపుడు రుద్రమదేవి పరిస్థితి ఇదే. ఇప్పటికి ఒకటి రెండు తేదీలు మారాయి. తాజాగా రావాల్సిన సెప్టెంబర్ 4 కూడా మారిపోయింది. అయితే అక్టోబర్ 2 అని వినిపిస్తోంది. కానీ ఇది కాదని, ఇంకా ముందుగానే రుద్రమదేవి విడుదలవుంటుందని తెలుస్తోంది. సెప్టెంబర్ 24న విడుదల చేయాలని గుణశేఖర్ భావిస్తున్నారు.
ఎందుకంటే రుద్రమదేవి బడ్జెట్ అయిన 70 కోట్ల షేర్ రావాలంటే, ఆ సినిమా కనీసం మూడు వారాలు స్టడీగా థియేటర్లలోవుండాలి. అక్టోబర్ 2న వస్తే ఇది సాధ్యం కావడం కష్టం. ఎందుకంటే ఈ సారి దసరా పోటీ ఇంతా అంతా కాదు. అక్టొబర్ రెండున రెండు మూడు వున్నాయి. ఆపైన అఖిల్, రామ్ చరణ్, రవితేజ వంటి పెద్ద సినిమాలు వున్నాయి. ఇలాంటపుడు వీలయినంత ముందుగా రావడమే కీలకం. అందుకే గుణశేఖర్ సెప్టెంబర్ 24న రావాలని చూస్తున్నాడట.