టాలీవుడ్ లో టాప్ సీడ్ రైటర్ కోన వెంకట్. ఆయనకు డైరక్షన్ ఆసక్తి వుంది. అంతకన్నా సినిమా నిర్మాణంపైనా ఆసక్తి. త్వరలో మొదలు కాబోయే నిఖిల్ తో శంకరాభరణం సినిమా నిర్మాణంలో ఆయన పాత్ర కూడా వుంది.. అలాగే నాగచైతన్యతో కూడా ఓ సినిమా చేయాలని ఆలోచిస్తున్నారట.
అయితే అది మాత్రం పక్కా నిర్మాతగానే. తెలుగు తమిళ ఆడియన్స్ కు పనికి వచ్చే ఓ మాంచి స్క్రిప్ట్ తయారుచేస్తున్నారని, దానిని ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్‌తో చేయించాలని ఆలోచిస్తున్నారని వినికిడి. హీరోగా నాగ చైతన్య అనుకుంటున్నారట.
ఏమాయ చేసావె తరువాత మళ్లీ గౌతమ్ డైరక్షన్ లో చేయాలని చైతూకు కూడా ఆసక్తిగానే వుంది కాబట్టి, ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ అయినట్లే.