సన్నీలియోన్‌ సక్సెస్‌ సీక్రెట్‌

పోర్న్‌ సినిమాల్లో నటించి, బాలీవుడ్‌ తారగా మారిన సన్నీలియోన్‌, బాలీవుడ్‌లో తనకు ఈ స్థాయి గుర్తింపు వస్తుందని బాలీవుడ్‌కి వచ్చేముందు ఏమాత్రం అనుకోలేదంటోంది. తన బ్యాక్‌గ్రౌండ్‌ చూసి, బాలీవుడ్‌ ప్రేక్షకులు తనను ఆదరిస్తారనుకోలేదనీ, తన…

పోర్న్‌ సినిమాల్లో నటించి, బాలీవుడ్‌ తారగా మారిన సన్నీలియోన్‌, బాలీవుడ్‌లో తనకు ఈ స్థాయి గుర్తింపు వస్తుందని బాలీవుడ్‌కి వచ్చేముందు ఏమాత్రం అనుకోలేదంటోంది. తన బ్యాక్‌గ్రౌండ్‌ చూసి, బాలీవుడ్‌ ప్రేక్షకులు తనను ఆదరిస్తారనుకోలేదనీ, తన గతాన్ని పట్టించుకోకుండా.. తెరపై తన నటనను, తన గ్లామర్‌ని చూసి ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా వుందని సన్నీలియోన్‌ చెప్పుకొచ్చింది.

ముంబైలో ఇల్లు అద్దెకు తీసుకోవడానికే చాలా కష్టపడాల్సి వచ్చిందన్న సన్నీలియోన్‌, గతాన్ని గురించి ఎప్పుడూ చింతించననీ, అయితే మళ్ళీ పోర్న్‌ సినిమాల గురించి ఆలోచించకూడదనే నిర్ణయం తీసుకున్నాననీ, కష్టపడి పనిచేయడమొక్కటే తనను ఈ స్థాయిలో వుంచిందంటోంది సన్నీలియోన్‌.

బాలీవుడ్‌ తెరపై నటించడం మొదట్లో చాలా కష్టంగా అన్పించిందనీ, డాన్స్‌ మూమెంట్స్‌ విషయంలో తానెంత కష్టపడ్డానో తనకే తెలుసనీ, ఇప్పుడు ఆ కష్టమంతా మర్చిపోయి కెరీర్‌ని ఎంజాయ్‌ చేస్తున్నానని సన్నీలియోన్‌ చెబుతోంది. గ్లామరస్‌గా కన్పిస్తూనే, నటనకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తానని చెప్పిన సన్నీలియోన్‌, యాక్షన్‌ ఓరియెంటెడ్‌ సినిమాల్లో నటించాలనుకుంటున్నానని, దానికోసం తగిన శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు వెల్లడిరచింది.