నాగ్ మహా తెలివైన వాడు

ఇదీ టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో వినిపిస్తున్న మాట. నాగ్ ప్లానింగ్ ఇలా వుంటుందట..ఏదైనా సినిమా హిట్ అయితే, ఆ డైరక్టర్ కు టాలెంట్ వుందని తెలిస్తే, వెంటనే అన్నపూర్ణ నుంచి ఫోన్ వచ్చేస్తుంది. వెళ్లి…

ఇదీ టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో వినిపిస్తున్న మాట. నాగ్ ప్లానింగ్ ఇలా వుంటుందట..ఏదైనా సినిమా హిట్ అయితే, ఆ డైరక్టర్ కు టాలెంట్ వుందని తెలిస్తే, వెంటనే అన్నపూర్ణ నుంచి ఫోన్ వచ్చేస్తుంది. వెళ్లి వాలిపోతారు కొత్త డైరక్టర్లు. తనకు సూటయ్యేదో, చైతూకు సూటయ్యేదో కథ వుంటే చెప్పమంటాడట నాగ్. కుర్ర డైరక్టర్లు కాస్త టైమ్ తీసుకుని లైన్ చెబుతారు. ఓకె అవుతుంది. ప్రాజెక్టు్ అంతా ఫైనల్ చేస్తారు. 

అప్పుడు నాగ్ ఎవరో ఒక ప్రొడ్యూసర్ కు కబురు చేసి, ఇదీ ప్రాజెక్టు అని చేతిలో పెడతాడట. సుధీర్ వర్మకు అలాగే ఫోన్ వెళ్లింది. చందు మొండేటికి అలాగే కబురు అందింది. ఆ సినిమా భోగవిల్లి ప్రసాద్ కు ఇచ్చాడు. ఈ సినిమా రాధాకృష్ణ (సన్నాఫ్ సత్యమూర్తి)కి అందించాడు. అంతే కాదు, అఖిల్ సినిమా కూడా అలాగే అంతా ప్రిపేర్ చేసి నితిన్ కు ఇచ్చాడు. అంటే ఒక విధంగా నాగ్ తనకు, పిల్లలకు ప్రాజెక్టులు తనే ప్రిపేర్ చేసి, ఇన్ స్టాంట్ ఫుడ్ గా నిర్మాతలకు అందిస్తున్నాడన్నమాట. 

అంతా సెట్ చేసి, పిలిచి చెప్పగానే నిర్మాతలకు మాంచి సినిమా ముందే కళ్ల ముందు కనిపించేస్తుంది. పైగా చాలా పనులు అన్నపూర్ణలోనే అయిపోతాయి కాబట్టి, ముందుగా పెట్టుబడి కొంత తగ్గుతుంది. ఆ మేరకు సినిమా ఫినిష్ చేసాక ఇవ్వవచ్చు. అదో ఫెసిలిటీ. ఒకె అంటారు. ఆ విధంగా పిల్లల కేరీర్ బాగానే ముందుకు నడిపిస్తున్నాడు నాగ్. పాపం ఇలా వెనక వుండి సెట్ చేసే వారు లేకనే, సుశాంత్ స్వంత సినిమాలు తీసుకుంటున్నాడు. సుమంత్ కూడా అదే బాటలో వున్నాడు.